Dil Raju : తెలుగులో వారసుడు వాయిదా.. నా మీద పడి అందరూ ఏడుస్తున్నారు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..

తాజాగా దిల్ రాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాడు. ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. తమిళ్ వరిసు సినిమాని సంక్రాంతికి వారసుడుగా తీసుకొస్తున్నాం. తెలుగులో ఈ సినిమాని జనవరి 14న రిలీజ్ చేస్తున్నాం. తమిళ్ తో పాటు మిగతా అన్ని చోట్లా జనవరి 11నే వారసుడు సినిమా.............

Dil Raju : తెలుగులో వారసుడు వాయిదా.. నా మీద పడి అందరూ ఏడుస్తున్నారు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..

Dil Raju postponed his Varasudu movie to January 14

Dil Raju :  ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బరిలోకి దిగుతున్నారు. అయితే వీరిద్దరి మధ్యలో దిల్ రాజు తన డబ్బింగ్ సినిమా వారసుడుని కూడా రిలీజ్ చేస్తున్నాడు. సైలెంట్ గా రిలీజ్ చేస్తే ప్రాబ్లమ్ ఏమి ఉండేది కాదు. కానీ దిల్ రాజు చాలా చోట్ల థియేటర్స్ ముందే బ్లాక్ చేసి తన వారసుడు సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఉండేలా చూసుకున్నాడు. దీంతో టాలీవుడ్ తో పాటు చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఇద్దరూ కూడా దిల్ రాజుపై సీరియస్ అవుతున్నారు.

దిల్ రాజుని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. అయినా దిల్ రాజు ఇన్ని రోజులు తగ్గేదే లేదు వాటికి పోటీగా వారసుడుని రిలీజ్ చేస్తా అని అన్నారు. ఆదివారం నాడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి కూడా ఇండైరెక్ట్ గా దిల్ రాజుకి కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇప్పటికే రిలీజయిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ట్రైలర్స్ తో ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అని అంతా ఫిక్స్ అయ్యారు. దీంతో దిల్ రాజు ఆలోచనలో పడ్డాడు.

Chiranjeevi : రవితేజ సినిమాలు హిట్టు అయినప్పుడు చిరంజీవి గారు పార్టీ ఇస్తారు.. కోన వెంకట్!

ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాడు. ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. తమిళ్ వరిసు సినిమాని సంక్రాంతికి వారసుడుగా తీసుకొస్తున్నాం. తెలుగులో ఈ సినిమాని జనవరి 14న రిలీజ్ చేస్తున్నాం. తమిళ్ తో పాటు మిగతా అన్ని చోట్లా జనవరి 11నే వారసుడు సినిమా రిలీజ్ అవుతుంది. ఇక్కడ మాత్రం జనవరి 14న రిలీజ్ చేయాలని ఇండస్ట్రీలో పెద్దవాళ్లందరితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాను. తమిళ్ లో ముందే రిలీజయి స్టోరీ బయటకి వచ్చినా నాకు కాన్ఫిడెన్స్ ఉంది సినిమా సూపర్ హిట్ అవుతుందని. అందుకే ధైర్యంగా తెలుగులో మూడు రోజుల తర్వాత రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇక కొంతమంది నా మీద పడి ఏడుస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకి థియేటర్స్ కావాలి, నిర్మాతలు అందరూ బాగుండాలి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు.