7 Days 6 Nights : ఈసారి ‘7 డేస్ 6 నైట్స్’ అంటున్న ఎం.ఎస్. రాజు..!

మే 10న ఎం.ఎస్. రాజు పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.. ఈ మూవీకి ‘7 డేస్ 6 నైట్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో.. ఎం.ఎస్. రాజు తనయుడు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్‌తో కలిసి నిర్మిస్తున్నారు..

10TV Telugu News

7 Days 6 Nights: ‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఎన్నో బ్లాక్‌ బ‌స్ట‌ర్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకుడిగా మారి గతేడాది ‘డర్టీ హరి’ అనే రొమాంటిక్ ఎంటర్‌‌టైనర్‌తో యూత్‌ని అలరించారు..

Dirty Hari

ఇప్పుడు మరో సెన్సేషనల్ ఫిలింతో రాబోతున్నారు. మే 10న ఎం.ఎస్. రాజు పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.. ఈ మూవీకి ‘7 డేస్ 6 నైట్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. పోస్టర్ రిలీజ్ చేశారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో.. ఎం.ఎస్. రాజు తనయుడు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్‌తో కలిసి నిర్మిస్తున్నారు..

7 Days 6 Nights

‘డర్టీ హరి’ తో నా లైఫ్ కొత్త మలుపు తీసుకుంది.. ఆ సినిమాని మించి ‘7 డేస్ 6 నైట్స్’ ఉంటుంది అని ఎం.ఎస్. రాజు అన్నారు.. నాన్న గారి బ్యానర్ మీద ఈ సినిమాను సమర్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది.. జూన్ 7 నుండి షూటింగ్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నాం.. ప్రస్తుతానికి యాక్టర్స్ వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం.. అన్నారు సుమంత్ అశ్విన్..