Spinach : పాలకూర వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా!..

మెదడు చురుగ్గా అయ్యెలా చేయడంతోపాటు, మానసిక సమస్యలను తగ్గించుకోవచ్చు. గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాన్సర్ తో కూడా పోరాడుతుంది. టైప్ 2 డయాబెటిస్ తగ్గించడంతో పాటు కంటి చూపును పెరిగే

Spinach : పాలకూర వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా!..

Spinach

Spinach : మనిషి శరీరానికి ప్రయోజనాలు కలిగించే ఆకుకూరల్లో పాల కూర ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఆకుకూరల్లోనే పాలకూర ఎంతో మేలైనదీ. పాల కూర తినటం వల్ల అనేక రోగాలు మనదరి చేరకుండా చూసుకోవచ్చు. పాల కూరలో యాంటీ ఆక్సీ డెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణసమస్యలు దూరంఅవుతాయి. శరీరానికి అవసరమైన విటమిన్ కె లభిస్తుంది. మలబద్ధకం నుండి విముక్తి పొందవచ్చు. పాల కూరలో వివిధరకాల డిజైన్లు, రంగులు, ఫ్లేవర్లున్నాయి. బర్గర్లు, సలాడ్లు, శాండ్ విచ్లు,సూప్స్ లో పాల కూరను ఎక్కువగా వినియోగిస్తారు.

ఓ కప్పు పాలకూరలో 5 కేలరీలు మాత్రమే ఉంటాయి. సోడియం మాత్రం 10 గ్రాములు వరకు ఉంటుంది. ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అసలు ఉండవు. పాలకూర మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులు, ఆస్థియోడైనియా పోగొడుతుంది. బరువు తగ్గాలనుకున్నవారు పాలకూర తినటం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.

మెదడు చురుగ్గా అయ్యెలా చేయడంతోపాటు, మానసిక సమస్యలను తగ్గించుకోవచ్చు. గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాన్సర్ తో కూడా పోరాడుతుంది. టైప్ 2 డయాబెటిస్ తగ్గించడంతో పాటు కంటి చూపును పెరిగేలా చేస్తుంది. పాలజీర్ణక్రియను సక్రమంగా పనిచేసేలా చేసి, నిద్రలేమిని దూరం చేసి వ్యాధినిరోధక శక్తిని ఇస్తుంది. ఎముకల్ని ధృడంగా చేస్తుంది. గర్భంతో ఉన్న స్త్రీలకు పాలకూరను తీనటంవల్ల ఎంతో మేలు కలుగుతుంది. పాలకూరలో ఉండే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు, క్యాన్సర్ ను నివారించటంలో దోహదం చేస్తాయి. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని ఇటీవలి పరిశోధనల్లో సైతం వెల్లడయ్యింది.

పాలకూరలో వుండే పొటాషియం, కండరాలను బలంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ ఎ వలన చర్మం ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. పొటాషియం, రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. పాలకూరలో వుండే విటమిన్ కె, జుట్టు ఊడిపోకుండా బలంగా ఉండేలా చేస్తుంది. ఇందులో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, త్వరగా ముసలితనం త్వరగా దరిచేరదు. శరీరంలో ఉండే చెడు వ్యర్థాల్ని బయటకు పంపుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి పాలకూర తినడంవల్ల సమస్య దూరమౌతుంది. ముఖ్యంగా శరీరానికి ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చేస్తుంది.