Doctors ChatGPT : పేషెంట్ల అనారోగ్యంపై ఇక బ్యాడ్ న్యూస్ చెప్పేది ఏఐ చాట్‌జీపీటీలే.. డాక్టర్లు కాదట.. ఎందుకో తెలుసా?

Doctors ChatGPT : ప్రతిరోజూ రోగులకు సంబంధించి అనారోగ్య సమస్యలపై చేదు వార్తలను చెప్పడం వైద్యులకు చాలా పెద్ద సవాలుగా మారుతుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా వైద్యులు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు.

Doctors ChatGPT : పేషెంట్ల అనారోగ్యంపై ఇక బ్యాడ్ న్యూస్ చెప్పేది ఏఐ చాట్‌జీపీటీలే.. డాక్టర్లు కాదట.. ఎందుకో తెలుసా?

Doctors don’t want to deliver bad news to patients anymore, they are taking help from ChatGPT

Doctors ChatGPT : ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీపైనే ఆధారపడుతోంది. ఇప్పటికే అనేక టెక్ దిగ్గజాలు సొంత ఏఐ టెక్నాలజీనే ఉపయోగిస్తున్నాయి. ప్రముఖ AI చాట్‌బాట్ (ChatGPT) ఇప్పుడు రోగులకు బాధ కలిగించే వార్తలను తెలియజేయడంలో సాయపడుతున్నాయి. సాధారణంగా రోగులకు సంబంధించిన చేదు వార్తలను వైద్యులే నేరుగా చెబుతుంటారు. ఇలా చేయడం ద్వారా పేషెంట్లకు మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఆ వార్త విన్న వెంటనే రోగులు షాక్‌తో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి లేకపోలేదు. అందుకే, ఇప్పుడు ChatGPT వంటి AI చాట్‌బాట్‌లను వైద్యులు ఉపయోగిస్తున్నారు.

ప్రతిరోజూ రోగులకు చెడు వార్తలను అందించడం వైద్యులకు పెద్ద సవాలు అని చెప్పాలి. తత్ఫలితంగా, రోగుల మరణాన్ని ఎదుర్కొనే ఫ్రీక్వెన్సీ కారణంగా క్లిష్టమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సున్నితంగా చెప్పలేకపోవచ్చు. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. వైద్యులు, ఇప్పుడు AI టెక్నాలజీతో పనిచేసే చాట్‌బాట్‌లను రోగులకు చేదు వార్తలను సున్నితంగా తెలియజేసేందుకు ఉపయోగిస్తున్నారు. (OpenAI) చాట్‌బాట్ అనేది నవంబర్‌లో లాంచ్ అయిన తర్వాత ప్రపంచమంతా బాగా పాపులర్ అయింది. ఇలాంటి చాట్‌జీపీటీల సాయంతో రోగులతో మరింత సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని వైద్యులు భావిస్తున్నారు.

Read Also  : Aadhar Card Free Update : ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఈ తేదీలోగా మీ ఆధార్‌లో ఏదైనా ఫ్రీగా మార్చుకోవచ్చు.. ఆ తర్వాత కష్టమే..!

ఇప్పటికే, (OpenAI) టెక్నాలజీలో పెట్టుబడిదారుడైన మైక్రోసాఫ్ట్‌లో రీసెర్చ్, ఇంక్యుబేషన్‌లకు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన పీటర్ లీ.. వైద్యులు, రోగుల మధ్య మరింత కమ్యూనికేషన్‌ను అందించడంలో చాట్‌బాట్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కొంతమంది వైద్యులు చాట్‌బాట్, చాట్‌జీపీటీని పబ్లిక్‌గా లాంచ్ చేసిన 72 గంటల తర్వాత ఉపయోగించడం ప్రారంభించారని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా, ChatGPT ఆకట్టుకునేలా వైద్య పరిజ్ఞానాన్ని ప్రదర్శించింది. అంతేకాదు.. వైద్యుల మాదిరిగా రోగులతో సున్నితంగా వ్యవహారించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. శాన్ డియాగోలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ నుంచి పరిశోధకులు ఒక అధ్యయనాన్ని నిర్వహించారు.

Doctors don’t want to deliver bad news to patients anymore, they are taking help from ChatGPT

Doctors don’t want to deliver bad news to patients anymore, they are taking help from ChatGPT

వైద్యుల కన్నా చాట్‌జీపీటీలే సున్నితంగా చెప్పగలవు  :
ఇందులో వైద్య నిపుణులు ChatGPT, మానవ వైద్యుల ప్రతిస్పందనలను పేషెంట్ల ప్రశ్నలతో పోల్చారు. చాట్‌బాట్ ప్రతిస్పందనలు మానవ వైద్యుల కన్నా ఎక్కువ క్వాలిటీతో మాత్రమే కాకుండా పేషెంట్లలో మరింత సానుభూతిని కలిగించేలా ఉన్నాయని పరిశోధనలు వెల్లడించాయి. సగటున, చాట్‌బాట్ సమాధానాలు వైద్యుల కన్నా 7 రెట్లు ఎక్కువ సానుభూతితో ఉన్నాయని తేలింది. ఈ అధ్యయనం సమయంలో సమర్పించిన 585 దృశ్యాలలో 78.6 శాతంలో, వైద్య నిపుణులు వైద్యుని కన్నా AI చాట్‌బాట్ ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ చాట్‌బాట్‌లు డాక్టర్-రోగి పరస్పర చర్యలను విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని సూచిస్తాయి.

గతంలో చాట్‌జీపీటీ యుఎస్ మెడికల్ లైసెన్సింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిందని నివేదించింది. అంతేకాకుండా, డాక్టర్, హార్వర్డ్ కంప్యూటర్ శాస్త్రవేత్త ధృవీకరించినట్లుగా.. OpenAI లేటెస్ట్ వెర్షన్, GPT-4, మరింత మెరుగైన వైద్యపరమైన తీర్పును ప్రదర్శిస్తుందని నివేదిక తెలిపింది. ChatGPT వంటి I-ఆధారిత టూల్స్ అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇందులోని లోపాలు లేదా తప్పు నిర్ధారణలకు అవకాశం ఉంది. కొంతమంది రోగులచే అలాంటి టూల్స్ దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉందని తేలింది. ఆరోగ్య సంరక్షణలో AI-ఆధారిత చాట్‌బాట్‌ల సానుభూతితో సున్నితమైన వైద్య సమాచారం కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి అవకాశాన్ని అందిస్తాయి. వైద్య డేటా కచ్చితమైన వివరణను నిర్ధారించడానికి ఈ టూల్స్ బాధ్యతాయుతమైన వినియోగాన్ని పర్యవేక్షించగలవు.

Read Also : Father’s Day 2023 : ఫాదర్స్ డే 2023 గిఫ్ట్స్.. రూ. 3వేల లోపు ధరకే వైర్‌లెస్ ఇయర్ బడ్స్, స్మార్ట్‌వాచ్‌లివే..!