Abdomen Tumor: మహిళ కడుపులోని 47కేజీల ట్యూమర్ తొలగించిన వైద్యులు

అపోలో హాస్పిటల్ లోని ఎనిమిది మంది వైద్యుల బృందం మహిళ కడుపులో ఉన్న 47కేజీల ట్యూబర్ ను తొలగించింది. అహ్మదాబాద్ బ్రాంచ్ కు చెందిన హాస్పిటల్ వైద్యులు 56ఏళ్ల మహిళ కడుపులో అతి పెద్ద

Abdomen Tumor: మహిళ కడుపులోని 47కేజీల ట్యూమర్ తొలగించిన వైద్యులు

Tumor Removed

Abdomen Tumor: అపోలో హాస్పిటల్ లోని ఎనిమిది మంది వైద్యుల బృందం మహిళ కడుపులో ఉన్న 47కేజీల ట్యూబర్ ను తొలగించింది. అహ్మదాబాద్ బ్రాంచ్ కు చెందిన హాస్పిటల్ వైద్యులు 56ఏళ్ల మహిళ కడుపులో అతి పెద్ద కణితి ఉన్నట్లుగా గుర్తించి సర్జరీ ద్వారా తొలగించారు.

ఆ మహిళ 18ఏళ్లుగా ట్యూమర్ ను మోస్తుందట. కొద్ది నెలలుగానైతే నడవడం కష్టమై మంచానికే పరిమితమైపోయిందట.

చీఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నేతృత్వంలో నలుగురు సర్జన్లతో కూడిన వైద్య బృందం సర్జరీని విజయవంతంగా ముగించారు. టిష్యూలతో పాటు అదనపు చర్మాన్ని కూడా తొలగించడంతో దాదాపు 47కేజీల బరువు తగ్గిపోయింది. 18ఏళ్ల క్రితం మహిళ కడుపులో కణితి పెరుగుతుందని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకుందట.

Read Also : బాల్యంలోనే హైబీపీ…నిర్లక్ష్యం చేశారా!

అప్పుడే సర్జరీ చేయించుకోవాలనుకున్నా.. కణితి అంతర్గత అవయవాలకు అతుక్కుని ఉందని తెలియడంతో మధ్యలోనే ఆపేశారు. అలా ట్యూమర్ పెరుగుతూ వచ్చింది. రెండేళ్లుగా సైజ్ రెట్టింపు అయిపోయింది.

Tumor Abdomen

Tumor Abdomen

‘సర్జరీకి ముందు రోగి బరువు చూడలేదు. ఆమె నిల్చొలేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆమె 49కేజీల బరువు ఉన్నారు. 56 సంవత్సరాల ఆమె శరీరం నుంచి 47కేజీల ట్యూమర్ ను తొలగించాం. అహ్మదాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఫిబ్రవరి 15న ఈ సర్జరీ జరిపాం’ అని వైద్యులు వెల్లడించారు.

‘తొలగించిన ట్యూమర్ మహిళ బరువు కంటే అధికంగా ఉంది. ట్యూమర్ పెరిగి అంతర్గత అవయవాల స్థానాలు మారేలా చేస్తున్నాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, మూత్రాశంయ వంటి భాగాలు పొట్టకు అతుకుని ఉన్న కణితి ఒత్తిడికి ఇబ్బందికి గురయ్యేవి’ అని మరో వైద్యుడు చెప్పాడు.

Read Also : చార్మినార్ వద్ద తవ్వకాల్లో బయటపడ్డ మెట్లు..