Basara IIIT Water Cut : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తాగునీరు కట్..!

బాసర ట్రిపుల్ ఐటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థుల ఆందోళనలు మూడో రోజూ కొనసాగుతున్నాయి.(Basara IIIT Water Cut)

Basara IIIT Water Cut : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తాగునీరు కట్..!

Basara Iiit Water Cut

Basara IIIT Water Cut : బాసర ట్రిపుల్ ఐటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థుల ఆందోళనలు మూడో రోజూ(గురువారం) కొనసాగుతున్నాయి. క్యాంపస్ గేటు వద్ద భారీగా బైఠాయించిన విద్యార్థులు మౌనంగా తమ నిరసన తెలుపుతున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అయితే, ఆందోళన చేస్తున్న తమకు కనీసం తాగునీరు కూడా అందివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. తాగునీటి సౌకర్యాన్ని నిలిపివేశారని, కావాలనే 4 గంటల పాటు నీటి సరఫరాను ఆపేశారని స్టూడెంట్స్ అంటున్నారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న నీళ్లు, విద్యుత్ ఆపివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఓపికను పరీక్షించొద్దని విద్యార్థులు హెచ్చరించారు.(Basara IIIT Narayana Arrest)

Basara: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు బయటకు రాకుండా..

విద్యార్ధుల ఆందోళనలతో అలర్ట్ అయిన తెలంగాణ విద్యాశాఖ.. బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ సతీశ్ కుమార్ ను నియమించింది. డైరెక్టర్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు.. డైరెక్టర్ నియామకం వల్ల సమస్యలు తీరవని తేల్చి చెప్పారు. తాము ప్రభుత్వం ముందు ఉంచిన 12 డిమాండ్లను పూర్తిగా నెరవేరిస్తేనే ఆందోళన విరమిస్తామంటున్నారు.

అయితే విద్యార్థులతో మరోసారి చర్చలకు సిద్ధమంటున్నారు అధికారులు. నిన్ననే విద్యార్థులతో చర్చలు ముగిశాయని, విద్యార్థులను కొందరు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు కలెక్టర్ ముషారఫ్ అలీ. ఆందోళన విరమించాలని విద్యార్థులను కోరారు. సాయంత్రం వరకు విద్యార్థులు దిగిరాకపోతే మరోసారి విద్యార్థులతో మాట్లాడతామని చెప్పారు కలెక్టర్. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని కలెక్టర్ ముషారఫ్ అలీ చెప్పారు.

Basara IIIT Students: రెండో దశ చర్చలు విఫలం.. సీఎం కేసీఆర్ రావాల్సిందేనంటూ విద్యార్థుల డిమాండ్..

కాగా, బాసర ట్రిపుల్ ఐటీలో పాలన అస్తవ్యస్థంగా మారిందన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్. మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందాల్సిన ల్యాప్ టాప్ లు, యూనిఫామ్ అందడం లేదని ఆరోపించారు. క్యాంపస్ లో సమస్యలు పెరగడమే విద్యార్థుల నిరసనలకు కారణం అన్నారు.

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు భైంసా ఏఎస్పీ కిరణ్‌ కారే తెలిపారు. విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. డైరెక్టర్‌ నియామకంపై విద్యార్థులకు తెలిపామన్నారు. విద్యార్థులకు ఆహారం, నీళ్లు నిలిపేశామనడం అవాస్తవమని ఏఎస్పీ వివరించారు. వారికి ఆహారం, నీళ్లు అందుతున్నాయని వివరించారు. కాగా.. తమ 12 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.

మెయిన్ గేటు ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టగా.. విద్యార్థులు గేటు వైపు దూసుకు రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆర్‌జీయూకేటీ రెండో గేటు ఎదుట విద్యార్థులు బైఠాయించారు. మద్దతుగా వచ్చిన విద్యార్థుల కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.(Basara IIIT Narayana Arrest)

సీఎం కేసీఆర్‌ వర్సిటీకి వచ్చి.. సమస్యలు పరిష్కరించే దాక ఆందోళన ఆపబోమని విద్యార్థులు స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా వేదికగానూ వేల మంది విద్యార్థులు తమ నిరసన తెలిపారు.
సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చినా.. వైస్‌ చాన్సలర్‌తో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా విద్యార్థులు మాత్రం పట్టు వీడటం లేదు. మాటలు చెప్పొద్దని.. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని సోషల్‌ మీడియా వేదికగా బదులిస్తున్నారు.