Aryan Khan : షారుఖ్ ఖాన్ కొడుక్కి మరోసారి చుక్కెదురు, మరో వారం జైల్లోనే

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు(23) ముంబై సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. డ్రగ్స్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ ముంబై సెషన్స్ కోర్టులో బెయిల్ పిట

Aryan Khan : షారుఖ్ ఖాన్ కొడుక్కి మరోసారి చుక్కెదురు, మరో వారం జైల్లోనే

Aryan Khan

Aryan Khan : బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు(23) మరోసారి కోర్టులో చుక్కెదురైంది. డ్రగ్స్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ ముంబై సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ బెయిల్ పిటిషన్ పై ఆర్యన్ తరపు న్యాయవాది అమిత్ దేశాయ్, ఎన్సీబీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 20న తీర్పును వెలువరిస్తామని తెలిపింది. దీంతో, అప్పటి వరకు ఆర్యన్ జైల్లోనే ఉండనున్నాడు. మరోవైపు, ఆర్యన్ కు డ్రగ్స్ వాడే అలవాటు ఎప్పటి నుంచో ఉందని కోర్టులో ఎన్సీబీ వాదించింది. ఆర్యన్ కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది.

Honey : టీలో తేనె కలుపుకుంటున్నారా! ఏం జరుగుతుందో తెలుసా?

ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు అడ్డంకిగా మారతాడని, ఆధారాలను మాయం చేసే అవకాశం కూడా ఉందని ఎన్సీబీ లాయర్ కోర్టులో వాదించారు. బెయిల్ మంజూరు చేస్తే ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తాడన్న వాదనను ఆయన లాయర్ తిప్పికొట్టారు. కేసు దర్యాప్తుపై అతని బెయిల్ ఎలాంటి ప్రభావం చూపలేదని వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్ధానం బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగించి తీర్పును మాత్రం ఈ నెల 20వ తేదీకి రిజర్వ్ చేసింది. పోలీసులు ఆర్యన్ ను తిరిగి ముంబై ఆర్ధర్ రోడ్ జైలుకు తరలించారు.

ఆర్యన్ ఖాన్ తో పాటు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మరో ఐదుగురికి ముంబై ఆర్ధర్ రోడ్ జైల్లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో వీరిని క్వారంటైన్ బ్లాక్ నుంచి ఉమ్మడి సెల్ కు పంపుతున్నట్లు ఆర్దర్ రోడ్ జైల్ సూపరింటెండెంట్ తెలిపారు.

Home Pollution : ముప్పుగా మారబోతున్న ఇంటి కాలుష్యం

ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్, ఆర్బాజ్ ఖాన్, మున్మున్ ధమేచాలతో పాటు పలువురు అరెస్ట్ కావడం సంచలనం సృష్టించింది. అక్టోబర్ 2 న ముంబై నుండి గోవా వెళ్తున్న కార్డెలియా క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరిగింది. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల హషిష్, 22 మాత్రలు ఎండీఎంఏ, 5గ్రాముల ఎండీ, 6 గ్రాముల చరాస్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్ ఖాన్ తన సన్నిహితుడు అర్బాజ్ మర్చంట్ నుండి డ్రగ్స్ సేకరించేవాడని తమ దర్యాప్తులో తేలిందని ఎన్సీబీ తెలిపింది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కీలక నిందితుడని, అతడు అమాయకుడు కాదని ఎన్సీబీ చెప్పింది. యావత్ దేశం మాదకద్రవ్యాల వాడకం గురించి ఆందోళన చెందుతోందని, ఇది కేవలం ఒక వ్యక్తి వినియోగం మాత్రమే కాదని, డ్రగ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘గ్యాంగ్’ ను పట్టుకోవాల్సి ఉందని ఎన్సీబీ వెల్లడించింది.