ECI Extends : ఐదు రాష్ట్రాల్లో ఆంక్షలు కంటిన్యూ..

ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలపై మొదట జనవరి 15 వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తర్వాత..దీనిని జనవరి 22 వరకు పొడిగించింది...

ECI Extends : ఐదు రాష్ట్రాల్లో ఆంక్షలు కంటిన్యూ..

Election Commission

Physical Rallies And Road Shows : ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల్లో ఇంకా ఆంక్షలు ఈసీ కంటిన్యూ చేస్తుందా ? లేక ఎత్తివేస్తుందా అనే ఉత్కంఠకు తెరపడింది. ఆంక్షలను కొనసాగించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. 2022, జనవరి 22వ తేదీన సీఈసీ..పలువురు అధికారులతో వర్చువల్ గా సమావేశాలు జరిపింది. ఐదు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉంది ? వ్యాక్సినేషన్ పై సమీక్ష జరిపింది. ప్రస్తుతం కరోనాతో పాటు..కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో…ఈనెల 31 వరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం కొనసాగుతుందని సమావేశం తర్వాత సీఈసీ అధికారులు ప్రకటించారు.

Read More : Minister Kodali Nani : గుడివాడలో కాసినో జరిగినట్లు నిరూపిస్తే చావడానికైనా రెడీ : మంత్రి కొడాలి నాని

ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలపై మొదట జనవరి 15 వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తర్వాత..దీనిని జనవరి 22 వరకు పొడిగించింది. ఇంటింటి ప్రచారం కోసం ఐదుగురు వ్యక్తుల నుంచి 10 మందికి పెంచుతున్నట్లు, ఇందులో ఇతర సూచనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఫేజ్ 01 ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులను జనవరి 27న, ఫేజ్ 02లో పోటీ చేసే అభ్యర్థులను జనవరి 31వ తేదీలోపు ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో…భౌతిక సమావేశాలను గరిష్టంగా 500 మందితో జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 08 వరకు (ఫేజ్ 1), ఫిబ్రవరి 01 నుంచి ఫిబ్రవరి 12 వరకు (ఫేజ్ 2) నిర్వహించుకోవచ్చని తెలిపింది.

Read More : AP Corona : ఏపీలో ఒక్కరోజే 12,926 కరోనా కేసులు, ఆరు మరణాలు నమోదు

మరోవైపు భారతదేశంలో కరోనా పంజా విసురుతూనే ఉంది. గత 24 గంటల్లో 3,37,704 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. 2,42,676 మంది రికవరి చెందారు. 488 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.