Electric Vehicles: ఎలక్ట్రిక్ బైకుల పేలుడు.. వాహనాలు రీకాల్ చేసిన ఓలా

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఓలా కంపెనీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Electric Vehicles: ఎలక్ట్రిక్ బైకుల పేలుడు.. వాహనాలు రీకాల్ చేసిన ఓలా

Electric Vehicles

Electric Vehicles: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. వాహనాల తయారీలో లోపాలుంటే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఓలా కంపెనీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందంజలో ఉన్న కంపెనీల్లో ఓలా ఒకటి. అయితే, గత నెలలో ఓలా స్కూటర్లు, బ్యాటరీలు పేలిపోయిన సంఘటనలు వెలుగుచూశాయి.

Electric Scooters : పేలుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఈ జాగ్రత్తలు పాటించండి

ఈ నేపథ్యంలో ఈ ఘటనలకు గల కారణాలను కనుగొనేందుకు కంపెనీ సిద్ధమైంది. ఇప్పటికే విక్రయించిన 1,441 ఓలా స్కూటర్లను రీకాల్ చేసింది. సంస్థకు చెందిన ఇంజనీర్లు బ్యాటరీలు, వాహనాలను పూర్తిగా తనిఖీ చేస్తారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే లోపాలను సరిదిద్దుతారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రమాణాలకు అనుగుణంగా తమ వాహనాలు ఉండేలా చూస్తామని ఓలా ప్రకటించింది. దేశంలో ఈమధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది.

Electric Vehicle Blast: మరో విద్యుత్ ద్విచక్ర వాహనం పేలుడు: వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు

వాహనాలు కాలిపోవడం లేదా బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో కొందరు మరణిస్తున్నారు కూడా. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఒకినావా ఆటోటెక్ అనే సంస్థ తమ కంపెనీకి చెందిన 3,000కు పైగా వాహనాలను రీకాల్ చేసింది. వినియోగదారులు తమ వాహనాలను స్వచ్ఛందంగా అందించాలని కంపెనీలు కోరుతున్నాయి.