Electricity Charges : తెలంగాణలో విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది-ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు

తెలంగాణలో స్వల్పంగా విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉండొచ్చని తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ చైర్మన్ శ్రీరంగారావు చెప్పారు

Electricity Charges : తెలంగాణలో విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది-ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు

Ts Erc Chairman

Electricity Charges :  తెలంగాణలో స్వల్పంగా విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉండొచ్చని తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ చైర్మన్ శ్రీరంగారావు చెప్పారు. ఈరోజు ఆయన 10 టీవీ విలేకరితో మాట్లాడుతూ  సరైన సమయానికి విద్యుత్ డిస్కంలు, ఏ ఆర్ ఆర్ సమర్పించక పోవడంతో గతంలో ఇచ్చిన వాటిని తిరస్కరించామని చెప్పారు. విద్యుత్ సంస్థలు కరెంట్ చార్జీల పెంపునకు సంబంధించిన టారిఫ్ సమర్పించేందుకు మరొకసారి గడువు ఇచ్చామన్నారు.

ఈనెల 27 తర్వాత డిస్కంలు సమర్పించక పోతే  సుమోటోగా తీసుకొని చర్యలు చేపడతామని శ్రీరంగారావు తెలిపారు. చార్జీలు పెంచినా, పెంచక పోయినా ప్రతి ఏడాది విద్యుత్ డిస్కంలు విధిగా నవంబర్ మొదటి వారంలో కల్లా ఏ.ఆర్.ఆర్.లు టారిఫ్ లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కానీ గత నాలుగేళ్లుగా విద్యుత్ డిస్కంలు ఏఆర్ఆర్ సమర్పించడం లేదని ఆయన తెలిపారు.

Also Read : New Year Celebrations 2022 : బార్లు, పబ్‌ల యాజమానులకు పోలీసు కమీషనర్ వార్నింగ్

27 వ తేదీ తర్వాత డిస్కంలు  టారిఫ్ అందించకపోతే  ఈ ఇ.ఆర్ సి నిబంధనల ప్రకారం జరిమానా వేసే హక్కు ఉందని శ్రీరంగారావు చెప్పారు. డిస్కంలు మరోసారి ఏఆర్ఆర్ లు, టారిఫ్ సరైన సమయంలో అందించకపోతే తామే విద్యుత్ చార్జీలపై పబ్లిక్ హియరింగ్ చేసి చార్జీల పెంపు ప్రకటన చేస్తామని చెప్పారు. ఎవరికీ నష్టం జరగకుండానే విద్యుత్ ఛార్జీల పెంపు ఉంటుందని…చార్జీల పెంపు స్వల్పంగానే ఉండొచ్చని శ్రీరంగారావు వివరించారు.