electric vehicles: బ్యాటరీ లోపాలతోనే ప్రమాదాలు: కేంద్ర కమిటీ
ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతుండటం, బ్యాటరీలు పేలిపోతుండటానికి బ్యాటరీ తయారీలో లోపాలే కారణమని కేంద్ర ప్రభుత్వ కమిటీ ప్రాథమిక అవగాహనకు వచ్చింది.

Electric Vehicle
electric vehicle: ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతుండటం, బ్యాటరీలు పేలిపోతుండటానికి బ్యాటరీ తయారీలో లోపాలే కారణమని కేంద్ర ప్రభుత్వ కమిటీ ప్రాథమిక అవగాహనకు వచ్చింది. ఓలాతోపాటు పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ బైకులు, బ్యాటరీలు పేలిపోయిన ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా ఎలక్ట్రిక్ బైకులు ప్రమాదాలకు గురవుతుండటంతో కేంద్రం స్పందించింది. ఈ అంశంపై కేంద్రం గత నెలలో ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ప్రమాదాలపై దర్యాప్తు చేసిన కమిటీ.. ఎలక్ట్రిక్ బ్యాటరీ తయారీలో లోపాల వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాథమిక నిర్ధరణకు వచ్చింది. బ్యాటరీ సెల్స్ లేదా డిజైన్ల లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది.
Revanth reddy: అప్పుడు మీరెక్కడున్నారు? కవిత, కేటీఆర్ ట్వీట్లకు కౌంటర్ ఇచ్చిన రేవంత్రెడ్డి..
ప్రమాదాలు జరిగిన అన్ని ఘటనలకు బ్యాటరీలో లోపాలే కారణంగా కమిటీ తేల్చింది. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఓలా, ఒకినావా వంటి సంస్థలు తమ ఎలక్ట్రిక్ బైకులను ఇప్పటికే రీకాల్ చేశాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురావాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎలక్ట్రిక్ బైకుల్లో నాణ్యమైన బ్యాటరీలు అమర్చేలా చూడాలని కోరుతూ దాఖలైన పిల్ విచారణ సందర్భంగా కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. గత నెలలో కేంద్ర రోడ్లు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ కూడా వాహనాల తయారీ కంపెనీలకు హెచ్చరికలు జారీచేశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో లోపాలుంటే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.