Bihar Motihari : ప్రిన్స్ పాల్ పోస్టు కోసం కొట్టుకున్నారు..వీడియో వైరల్

స్కూల్‌లో పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్, టీచర్ భర్త..ఒకరినొకరు తన్నుకున్నారు. బీహార్‌ రాజధాని పాట్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Bihar Motihari : ప్రిన్స్ పాల్ పోస్టు కోసం కొట్టుకున్నారు..వీడియో వైరల్

School

Updated On : October 15, 2021 / 10:50 AM IST

Fight At Education Dept Office : సాధారణంగా టీచర్లు ఏం చేస్తారు ? బడిలో పిల్లలకు పాఠాలు చెబుతారు. విద్యాబుద్ధులు నేర్పిస్తారు. పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దుతారు ! ఎక్కడైనా టీచర్లు ఇవే చెయ్యాలి. చేస్తారు కూడా!! స్కూల్‌లో పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్, టీచర్ భర్త..ఒకరినొకరు తన్నుకున్నారు. బీహార్‌ రాజధాని పాట్నాకు సమీపంలో ఉంటున్న శివశంకర్ గిరి, రింకీ కుమారీ ఇద్దరూ స్థానిక స్కూల్‌లో టీచర్స్ గా పనిచేస్తున్నారు. ప్రిన్సిపల్ సీటు కోసం ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

Read More : Petrol and Diesel Price : పండుగ రోజు షాక్.. పెరిగిన ఫ్యూయల్ ధరలు

నేను సీనియర్ అంటే నేను సీనియర్ అంటూ ఇద్దరూ పోటీ పడ్డారు. చివరకు జిల్లా విద్యాశాఖ అధికారులు సీనియార్టీ డాక్యుమెంట్స్ సమర్పించాలని ఆదేశించారు. రింకీ కుమారీ తన భర్తను తీసుకుని ఆఫీసుకు వెళ్లింది. అప్పుడే మరో టీచర్ శివశంకర్ కూడా అక్కడి వచ్చారు. ఇంకేముంది..ఉన్నది ఒకటే ప్రిన్సిపల్ పోస్టు కావడంతో.. నాకంటే నాకంటూ వాదనకు దిగారు.. లేడీ టీచర్ భర్తటీచర్‌పై దాడి చేశాడు.. ఇద్దరూ పీకలు పట్టుకునే స్థాయి వరకు గొడవ పడ్డారు.

Read More : Aryan Khan : షారుఖ్ ఖాన్ కొడుక్కి మరోసారి చుక్కెదురు, మరో వారం జైల్లోనే

కిందపడి తన్నుకున్నారు. అక్కడనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్తా వైరల్ అయ్యింది. వారు చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు చిర్రెత్తు కొచ్చింది…!!! ప్రిన్సిపల్‌గా ప్రమోషన్ ఇవ్వడం సంగతి పక్కనపెట్టి.. వీళ్లిద్దరిపై విచారణకు ఆదేశించారు.