Five States Election : రేపే ఎన్నికల ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ, విజేతలు ఎవరో ?

ఓట్ల క్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Five States Election : రేపే ఎన్నికల ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ, విజేతలు ఎవరో ?

Five States Election

Five States Election 2022 : సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2022, మార్చి 10వ తేదీ గురువారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. యూపీలో 403 స్థానాలున్నాయి. మొత్తం 75 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడుంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సమాజ్ వాదీ మరోసారి ప్రతపక్షానికే పరిమితం అవుతుందని వెల్లడించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస సీట్లు 202.

Read More : UP Election 2022 : ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి, ఖండించిన సీఈసీ

గోవా అసెంబ్లీలో 40 స్థానాలున్నాయి. ఒకేసారి పోలింగ్ జరిగింది. 332 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు 21.

Read More : ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు

ఉత్తరాఖండ్ లో 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. 13 జిల్లాల పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. 632 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లలో విజయం సాధించాల్సి ఉంటుంది.

మణిపూర్ లో 60 స్థానాలున్నాయి. రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. 265 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కనీస సీట్లు 31 కావాల్సి ఉంటుంది.

Read More : Assembly Elections: ముగింపు దశకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. 2023లో తొమ్మిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు

పంజాబ్ లో 117 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. 66 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. వేయి 304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఓడిపోతుందని, ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు 59.