UP Election 2022 : ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి, ఖండించిన సీఈసీ

ఈవీఎంల విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈవీఎంలను ట్యాపరింగ్ అయ్యాయని సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు ఆరోపణలు గుప్పించాయి.

UP Election 2022 : ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి, ఖండించిన సీఈసీ

Cec

EVM Tampering : ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాలు వెలువడడమే తరువాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈవీఎంల విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈవీఎంలను ట్యాపరింగ్ అయ్యాయని సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. ఎలక్ట్రానిక్ ఓటర్ మిషన్ ను ఎవరూ హ్యాక్ చేయలేరని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర హామీనిచ్చారు. పూర్తిగా సురక్షితమైన యంత్రమని, ప్రతి పౌరుడు గర్వపడాలన్నారు.

Read More : Five States Election : ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్ని సీట్లు అవసరం, వివరాలు

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలపై సీఈసీ కౌంటర్ ఇచ్చింది. ఎలాంటి అవతవకలు జరగలేదని తెలిపారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, స్థానిక అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండా వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ వాటిని రవాణా చేస్తున్నారని అఖిలేష్ ఆరోపణలు చేశారు. ఇది కేవలం ఓటర్లను తప్పుదోవ పట్టించడానికి, అపోహలను వ్యాప్తి చేయడానికి చేసిన ప్రయత్నమని ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర వెల్లడించారు. వారణాసిలోని ఈవీఎంలు శిక్షణ కోసం వారణాసికి తరలించామన్నారు.
మరోవైపు… ఈవీఎంలపై కాంగ్రెస్ సందేహాలను వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ట్యాపరింగ్ ను అడ్డుకోవాలని కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ తెలిపారు. దీనిని యూపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఖండించింది.

Read More : ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు

యూపీ, పంజాబ్, ఉత్తారఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 2022, మార్చి 10వ తేదీ గురువారం జరుగనుంది. లెక్కింపు కోసం వేల మందికి శిక్షణనిచ్చారు. ఈసీ కౌంటింగ్ షెడ్యూల్ ను కూడా ఇప్పటికే విడుదల చేసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. యూపీలో 75 జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పంజాబ్ లో 66 కేంద్రాలు, ఉత్తారాఖండ్ లో 13 జిల్లాల పరిధిలో కౌంటింగ్ జరుగనుంది.