Goa CM : జెండా ఎగురవేయకుండా అడ్డుకొంటే..కఠిన చర్యలు

దక్షిణ గోవాలోని సావో జాసింటో ద్వీపం నివాసితులను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఘాటుగా హెచ్చరించారు. దేశమే తొలి ప్రాధాన్యతంటూ స్పష్టం చేశారు.

Goa CM : జెండా ఎగురవేయకుండా అడ్డుకొంటే..కఠిన చర్యలు

Goa Cm

Flag Hoisting Event : దక్షిణ గోవాలోని సావో జాసింటో ద్వీపం నివాసితులను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఘాటుగా హెచ్చరించారు. జెండా ఎగురవేయకుండా నేవీని అడ్డుకుంటే దేశ వ్యతిరేక చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వాటిని ఉక్కు పిడికిలితో అణచివేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. తమకు దేశమే తొలి ప్రాధాన్యతంటూ స్పష్టం చేశారు. ఆ ద్వీపంలో జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించాలని నేవీని కోరారు. గోవా పోలీసుల సహకారం కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

Read More : AP : బ్యాక్ టు స్కూల్, మోగనున్న బడి గంటలు..నిబంధనలివే

దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దేశంలోని అన్ని ద్వీపాల్లో జాతీయ జెండాలను ఎగురవేసే కార్యక్రమానికి రక్షణ మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గోవాలోని INS హంసా నౌకా కేంద్రం అధికారులు ఏర్పాట్ల కోసం సావో జాసింటో ద్వీపానికి వెళ్లారు. అయితే అక్కడున్న సుమారు వంద కుటుంబాలు జెండాను నేవీ ఎగురవేయడంపై అభ్యంతరం తెలిపారు.

Read More : మెగాస్టార్ చిరంజీవికి సీఎం జగన్ ఆహ్వానం

దీంతో ఈ కార్యక్రమం చేపట్టబోమని నేవీ తెలుపగా గోవా సీఎం అక్కడి ప్రజలకు వార్నింగ్‌ ఇచ్చారు. అయితే, జాతీయ జెండా ఆవిష్కరణకు తాము వ్యతిరేకం కాదని సావో జాసింటో వాసులు స్పష్టం చేశారు. మేజర్ పోర్ట్స్ అథారిటీస్ బిల్లు 2020 కింద కేంద్ర ప్రభుత్వం ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నౌకాదళం జెండా ఆవిష్కరణతో ఇది ప్రారంభమవుతుందేమోనని భయపడుతున్నట్లు తెలిపారు. అందుకే జాతీయ జెండాను ఎగురవేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు క్లారిటి ఇచ్చారు.