Flipkart Black Friday Sale : ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్.. స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన డీల్స్.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్..!
Flipkart Black Friday Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ (Black Friday Sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.

Flipkart Black Friday Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ (Black Friday Sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ కొనుగోలుదారులు ICICI బ్యాంక్ కార్డ్‌లు, కోటక్ బ్యాంక్ కార్డ్‌లు, సిటీ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై 12శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ-టైలర్ విక్రయ సేల్ సమయంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, No-cost EMI, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ (Flipkart Pay Later) కొనుగోలు ఆప్షన్ కూడా ఉంది. స్మార్ట్ టీవీలపై అద్భుతమైన కొన్ని డీల్‌లు పొందవచ్చు.
Realme NEO (32 అంగుళాల) HD రెడీ LED స్మార్ట్ Linux TV :
Flipkartలో బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా Realme NEO (32 అంగుళాల) HD రెడీ LED స్మార్ట్ Linux TVని రూ.11,999 కి కొనుగోలు చేయవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఈ డీల్‌పై రూ. 11వేల విలువైన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. స్మార్ట్ టీవీ Linuxలో రన్ అవుతుంది. 60Hz రిఫ్రెష్ రేట్, 20W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది.

Flipkart Black Friday Sale _ Best deals on smart TVs you should not miss
Mi 5A (32 అంగుళాల) HD రెడీ LED స్మార్ట్ Android TV :
ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా.. డాల్బీ ఆడియో (2022 మోడల్)తో కూడిన Mi 5A 80 సెం.మీ (32 అంగుళాల) HD రెడీ LED స్మార్ట్ Android TVని రూ.13,499కి కొనుగోలు చేయవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఈ డీల్‌పై రూ.11వేల విలువైన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్‌లో రన్ అవుతుంది. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ ఇన్‌బిల్ట్‌కు సపోర్ట్ చేస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్, 20W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది.

Flipkart Black Friday Sale _ Best deals on smart TVs you should not miss
LG 80 సెం.మీ (32 అంగుళాల) HD రెడీ LED స్మార్ట్ WebOS TV :
ఎల్‌జీ టీవీలో LG 80 సెం.మీ ( 32 అంగుళాల) HD రెడీ LED స్మార్ట్ WebOS TV రూ. 21,990కి బదులుగా రూ.13,990 కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లతో పాటు రూ. 11వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ WebOSలో రన్ అవుతుంది. Netflix, Prime Video, Disney+Hotstar, Youtubeకి సపోర్టు అందిస్తుంది. ఇది 50Hz రిఫ్రెష్ రేట్, 10W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది.

Flipkart Black Friday Sale _ Best deals on smart TVs you should not miss
OnePlus Y1 (40 అంగుళాలు) Full HD LED స్మార్ట్ Android TV :
డాల్బీ ఆడియో (40FA1A00)తో కూడిన OnePlus Y1 100 cm (40 అంగుళాలు) ఫుల్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ. 27,999కి బదులుగా రూ.19,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లతో పాటు రూ. 7,600 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్‌లో రన్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్‌కు సపోర్టు ఇస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్, 20W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది.

Flipkart Black Friday Sale _ Best deals on smart TVs you should not miss
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..