CM KCR : పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొద్దు : సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని పోడు రైతులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంతో కొట్లాడైనా వారికి న్యాయం చేయాలన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొదన్నారు.

CM KCR : పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొద్దు : సీఎం కేసీఆర్

Ts.assembly

telangana assembly sessions : రాష్ట్రంలోని పోడు రైతులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంతో కొట్లాడైనా వారికి న్యాయం చేయాల్సివుందన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొద్దని చెప్పారు. తాత, తండ్రుల నుంచి అనాధిగా అడవుల్లో ఉన్న వారిని అక్కడ నుంచి తీసివేయడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. వారి జీవనోపాధిపై దెబ్బ కొట్టడం కూడా కరెక్టు కాదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు లక్షలు కాకుండా మరో ఆరు లేదా ఏడు లక్షల ఎకరాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్నట్లు సమాచారం వస్తుందన్నారు.

రాష్ట్ర గిరిజనులకు మొత్తం కలిపి 10 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చి అక్కడికి స్టాప్ చేసి, నో ఫర్దర్ ఎన్ క్రోచ్ చెబుదామని తెలిపారు. ఈ ప్రతిపాదనను కేంద్రం దగ్గరికి తీసుకెళ్తే వారు కూడా అంగీకరించే అవకాశం ఉంటుందన్నారు. వీలైతే ఈ శాసన సభా సమావేశాల్లోనే తీర్మానం చేసి కేంద్రానికి కేంద్రానికి పంపిద్దామని చెప్పారు. రాష్ట్ర గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన అవరముందన్నారు. అయితే ఛత్తీస్ ఘడ్ నుంచి గుత్తికోయలు తెలంగాణలోకి వస్తున్నారని తెలిపారు. వారిని సమస్య వస్తుందన్నారు. గుత్తికోయలు, మరొకరు కావొచ్చు వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి వచ్చి అడవులను ఆక్రమించి ధ్వంసం చేస్తే మళ్లీ ఇబ్బందులు వస్తాయని చెప్పారు.

CM KCR : మొక్కల పెంపకంలో చైనా ఆదర్శం.. భారత్ లో ఒక వ్యక్తికి 28 మొక్కలు ఉండటం బాధాకరం : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో 96 వేల 676 మంది గిరిజనులకు 3.8 లక్షల ఎకరాలు ఆర్ఓఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైతు బంధు ప్రారంభించినప్పుడు వీరికి రైతు బంధు వచ్చేది కాదన్నారు. గిరిజన ఎమ్మెల్యేలు తనను రిక్వెస్టు చేస్తే వారిని పరిగణనలోకి తీసుకుని రైతు బంధు అమలు వర్తింప చేస్తున్నామని చెప్పారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలన్నారు. సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇచ్చిన 3 లక్షల 8 వేల ఎకరాల ఆర్ఓఎఫ్ ఆర్ కాకుండా ఎంత భూమి పోడు వ్యవసాయం చేస్తున్నారనే లెక్క తేల్చితే అక్కడి స్టాప్ చేసి వారికి ఆర్ఓఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చి రైతు బంధు అమలు చేస్తే సమస్య సమిసి పోతుందన్నారు.

దీంతో గిరిజునులు, పోలీసులు మధ్య ఘర్షణ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు. కావాలంటే ఈ యాక్ట్ తేదీని పొడిగించాలని కేంద్రానికి విన్నవించుకోవాలన్నారు. ఆర్ఓఎఫ్ ఆర్ పట్టా ఇచ్చినంత మాత్రానా వీరు యజమానులు కారని…వీరికి ఓనర్ మాత్రం ఫారెస్టు ఉంటదని వీరికి కొన్ని సదుపాయాలు వస్తాయని చెప్పారు. ఫారెస్టు లైక్ కల్టివేషన్ అంటారని తెలిపారు. జీవన భృతి కోసం మాత్రమే పట్టా ఇస్తారు తప్ప…వారు యజమానులు కాలేరని స్పష్టం చేశారు.