BEAR ATTACK: హమ్మయ్య దొరికింది.. ఎలుగు బంటిని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు.. జూకు తరలింపు

శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది.. ఓ ఇంట్లో దూరి దాక్కుంది. చివరికి అటవీశాఖ అధికారులు వచ్చి మత్తు మందు ఇచ్చి దానిని పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

BEAR ATTACK: హమ్మయ్య దొరికింది.. ఎలుగు బంటిని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు.. జూకు తరలింపు

Bear

BEAR ATTACK: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది.. ఓ ఇంట్లో దూరి దాక్కుంది. చివరికి అటవీశాఖ అధికారులు వచ్చి మత్తు మందు ఇచ్చి దానిని పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలోని ఓ రేషన్ డీలర్ చెందిన కోబ్బరి తోటలోని రేకుల షెడ్ వద్ద ఎలుగు బంటి తిష్ట వేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలికి చేరుకొని ఎలుగు బంటిని బంధించే ప్రయత్నం చేశారు. రెస్క్యూ బృందం రంగంలోకి దిగి ఆపరేషన్ బంటిని ప్రారంభించాురు. ఎలుగు బంటిని పట్టుకొని విశాఖ జూకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. అయితే అది ఓ ఇంటిలోకి దూరడంతో దానిని బంధించేందుకు కొంత సమయం పట్టింది.

Bears in Srisailam: మూడు రోజులుగా శ్రీశైలంలో ఎలుగుబంట్లు హల్ చల్

ఇదిలాఉంటే కిడిసింగి వద్ద స్థానికులపై నిన్న ఎలుగుబంటి దాడిచేసినట్లు తెలిసింది. ఈ దాడిలో పలువురికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామం పరిధిలోని ఓ ఇంట్లో ఎలుగు బంటి తిష్ట వేయడంతో అది ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామస్తులు వణికిపోయారు. కిడిసింగిలో ఎలుగు బంటి తిష్ట వేసిన ఇంటిని ఇరవై మీటర్ల దూరంలో అటవీ, టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసు చుట్టుముట్టారు. కిడసింగి, వజ్రపు కోత్తూరు రహదారిని మూసివేశారు. చివరికి ఎలుగుబంటికి మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. అనంతరం విశాఖ జూకు తరలించారు.

Presidential election: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..? టీఎంసీకి రాజీనామా

సోమవారం వజ్రపుకొత్తూరు సంతోషిమాత ఆలయ సమీపంలోని జీడి తోటలో పశువుల కోసం రేకుల షెడ్డు వేస్తుండగా ఎలుగుబంటి దాడిచేసింది. బాధితుల కేకలు విని పక్కనే రహదారిపై వెళ్తున్న ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు, మరో వ్యక్తి అక్కడకు వెళ్లారు. వారిని ఎలుగుబంటి తీవ్రంగా గాయ పరిచింది. వీరి అరుపులు విని అక్కడకు వచ్చిన ఇద్దరు జవాన్లు ఎలుగు బంటి దాడికి గురయ్యారు. కాగా మంగళవారం మత్తుమందు ఇచ్చి ఎలుగు బంటిని అటవీ శాఖ అధికారులు జూకు తరలించడంతో స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.