Bears in Srisailam: మూడు రోజులుగా శ్రీశైలంలో ఎలుగుబంట్లు హల్ చల్

శ్రీశైల మండలంలో పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. గత మూడు రోజులుగా సున్నిపెంట దోమలపెంట ప్రాంతాల్లో ఎలుగులు సంచరిస్తున్నాయి.

10TV Telugu News

Bears in Srisailam: కర్నూలు జిల్లా శ్రీశైల మండలంలో పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. గత మూడు రోజులుగా సున్నిపెంట దోమలపెంట ప్రాంతాల్లో ఎలుగులు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి ఎలుగుల సంచారంతో స్థానికులు ఇళ్ల నుండి బయటకు రావాలంటే భయాందోళన చెందుతున్నారు. సున్నిపెంట గ్రామంలో పూర్ణానంద ఆశ్రమం, బండ్లబజార్ ప్రాంతాలలో మూడు రోజుల నుంచి ఎలుగుబంట్ల హల్ చల్ చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఎలుగుబంట్లను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సున్నిపెంట చేరుకున్న అటవీశాఖ సిబ్బంది గ్రామం నుంచి ఎలుగుబంట్లను తరిమేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Aslo read: Adventure Bikes: బడ్జెట్ లో టాప్ అడ్వెంచర్ టూరింగ్ బైక్స్

ఎలుగుబంట్లను తిరిగి అడవిలోకి దారి మళ్లించేందుకు టపాసులు కాలుస్తూ, లౌడ్ స్పీకర్లు వినియోగించి శబ్దాలు చేస్తున్నారు. అయితే అడవిలోకి వెళ్లిన ఎలుగుబంట్లు తిరిగి జనావాసాల్లోకి వస్తుండడంతో, శాశ్వత పరిష్కారం దొరక్క అటవీశాఖ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. శుక్రవారం నాడు చివరి ప్రయత్నంగా ఎలుగులను దారి మళ్లిస్తామని, లేదంటే బోనులో బందించి అడవిలోపల వదిలి రావాల్సి ఉంటుందని అటవీశాఖ సిబ్బంది పేర్కొన్నారు. మరో వైపు సున్నిపెంట గ్రామస్తులు సైతం ఎలుగులను తరిమికొట్టేందుకు నిద్రాహారాలు మాని అటవీశాఖ సిబ్బందికి సహాయం చేస్తున్నారు.

Also read: Terrorists Encounter: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు

×