Viral Video: మాస్క్‌తో భయపెట్టే ఫ్రాంక్.. చివరికి కటకటాల పాలు!

జనాల్ని భయపెట్టి ఆనందం పొందాలి. కొందరు దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదిస్తే మరికొందరు భయపడే జనాల్ని చూసి శునకానందం పొందుతారు. ఈ మధ్య కాలంలో దెయ్యాలు, భూతాల మాదిరి మాస్క్స్ ధరించి జనాల్ని భయపెట్టే కల్చర్ ఎక్కువవుతుంది. ఇది కొంతమందికి ప్రాణాల మీదకి తెస్తున్నా చేసేవారు మాత్రం కొత్త కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు.

Viral Video: మాస్క్‌తో భయపెట్టే ఫ్రాంక్.. చివరికి కటకటాల పాలు!

Viral Video

Viral Video: జనాల్ని భయపెట్టి ఆనందం పొందాలి. కొందరు దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదిస్తే మరికొందరు భయపడే జనాల్ని చూసి శునకానందం పొందుతారు. ఈ మధ్య కాలంలో దెయ్యాలు, భూతాల మాదిరి మాస్క్స్ ధరించి జనాల్ని భయపెట్టే కల్చర్ ఎక్కువవుతుంది. ఇది కొంతమందికి ప్రాణాల మీదకి తెస్తున్నా చేసేవారు మాత్రం కొత్త కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు.

అయితే, అలా ఫ్రాంక్ చేయబోయిన ఓ కుర్రాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పాకిస్తాన్‌లోని పెషావర్‌కు చెందిన ఓ వ్యక్తి భయంకరమైన ముఖాన్ని పోలిన ఓ మాస్కును ధరించి రోడ్డు మీద వెళ్లే వారిని ఆట పట్టించాలనుకున్నాడు. అయితే ఆ వ్యక్తిని ముందే గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో కూడా ప్రజలను భయపెట్టాలని ఈ వ్యక్తి ప్లాన్ చేసుకున్నాడు.

ఈ వ్యక్తి తతంగాన్ని ముందే గమనించిన పోలీసులు అతన్ని జైల్లో పెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా ఈ కల్చర్ నడుస్తున్నా పాకిస్తాన్ పోలీసులు మాత్రం పలు సందర్భాల్లో గతంలో కూడా ఇలానే అరెస్ట్ చేశారు. మన దేశంలో కూడా ఇలా ఘోస్ట్, జంతువుల మాదిరి మాస్క్ లు ధరించి హల్చల్ చేసే వారు ఎక్కువ అవుతుండగా ఇక్కడ కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.