Covid Booster Dose: కరోనా బూస్టర్ డోసు కోసం 75 రోజుల ప్రత్యేక డ్రైవ్

18 నుంచి 59 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సు వారికి బూస్ట‌ర్ డోసు వేస్తార‌ని అధికారులు తెలిపారు. ఈ ప్ర‌త్యేక డ్రైవ్ జూలై 15 నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని వివ‌రించారు.

Covid Booster Dose:  కరోనా బూస్టర్ డోసు కోసం 75 రోజుల ప్రత్యేక డ్రైవ్

Covid 19 Vaccine

Covid Booster Dose: ప్రజలకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును ఉచితంగా వేయ‌డానికి 75 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేప‌డుతున్న‌ట్లు వివ‌రించింది. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుంది. దేశ జ‌నాభాలో మెజారిటీ ప్ర‌జ‌ల‌కు రెండో డోసు వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం 9 నెల‌ల ముందే ముగిసింద‌ని అధికారులు తెలిపారు. సాధార‌ణంగా రెండో డోసు వేసుకున్న ఆరు నెల‌ల త‌ర్వాత ప్ర‌తిర‌క్ష‌కాల స్థాయులు త‌గ్గుతాయ‌ని చెప్పారు.

Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి

బూస్ట‌ర్ డోసు ఇవ్వ‌డం వ‌ల్ల రోగనిరోధ‌క ప్ర‌తిస్పంద‌న పెరుగుతుంద‌ని తెలిపారు. అందుకే కేంద్ర ప్ర‌భుత్వం 75 రోజుల పాటు ఉచితంగా బూస్ట‌ర్ డోసు ఇవ్వ‌డానికి ప్ర‌త్యేక డ్రైవ్ చేప‌డుతుంద‌ని వివ‌రించారు. ఇందులో భాగంగా 18 నుంచి 59 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సు వారికి బూస్ట‌ర్ డోసు వేస్తార‌ని అధికారులు తెలిపారు. ఈ ప్ర‌త్యేక డ్రైవ్ జూలై 15 నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని వివ‌రించారు. కాగా, క‌రోనా కేసులో దేశ వ్యాప్తంగా మ‌ళ్ళీ క్ర‌మంగా పెరిగిపోతున్నాయి. ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వం సూచించింది.