Bird Flu : మరో వైరస్ కలకలం.. కోళ్లు, గుడ్లు, మాంసం వినియోగం, అమ్మకాలపై నిషేధం

అసలే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. వైరస్ దెబ్బతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది చాలదన్నట్టు మరో వైరస్..

Bird Flu : మరో వైరస్ కలకలం.. కోళ్లు, గుడ్లు, మాంసం వినియోగం, అమ్మకాలపై నిషేధం

Bird Flu

Bird Flu : అసలే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. వైరస్ దెబ్బతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది చాలదన్నట్టు మరో వైరస్ కలకలం రేగింది. జనాల్లో మరింత ఆందోళన పెరిగింది.

SBI CBO Recruitment 2021 : ఎస్బీఐలో ఉద్యోగాలు.. 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

కేరళలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. అలప్పుళ జిల్లాలోని తకాళి పంచాయతీలో ఈ వైరస్‌ వ్యాప్తిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మరింత విస్తరించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. పంచాయతీలోని 10వ వార్డు చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిలో బాతులు, కోళ్లు, ఇతర పెంపుడు పక్షులను చంపాలని నిర్ణయించారు. ఇందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. స్థానికంగా పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ అలెగ్జాండర్ పశుసంవర్ధక, ఆరోగ్య, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

iPhone 13 Mini: ఐఫోన్‌పై నెవర్ బిఫోర్ ఆఫర్.. రూ.36వేలు డిస్కౌంట్

అంతేకాదు బాతులు, కోళ్లు, పక్షుల గుడ్లు, మాంసం వినియోగం, అమ్మకాలను నిషేధించారు. హరిప్పడ్‌ మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల దాదాపు 12 పంచాయతీల్లోనూ ఈ నిషేధాజ్ఞలు అమలు కానున్నాయి. మరోవైపు వలస పక్షులకు వైరస్‌ సోకిందో లేదో నిర్ధారించాలని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు.