Gajapippali: ఆయిల్ పామ్‌లో గజపిప్పలి

దినదినాభివృద్ధి చెందుతూ తెలుగు రాష్ట్రాల్లో అధిక రాబడులు పొందుతున్న పంట ఆయిల్ పామ్. నాటిన మూడెళ్ల తర్వాత నుంచి దిగుబడులు సంపాదించే పంట ఇది.

Gajapippali: ఆయిల్ పామ్‌లో గజపిప్పలి

Gajapippili

Gajapippali: దినదినాభివృద్ధి చెందుతూ తెలుగు రాష్ట్రాల్లో అధిక రాబడులు పొందుతున్న పంట ఆయిల్ పామ్. నాటిన మూడెళ్ల తర్వాత నుంచి దిగుబడులు సంపాదించే పంట ఇది. 18 ఏళ్ల వరకూ దిగుబడులు వచ్చి.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ ఉంటుంది. రైతులు అంతర పంటల సాగువైపు అడుగులు వేస్తున్న తరుణంలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఆయిల్ పామ్ లో కోకో, గజపిప్పలి సాగుచేస్తూ మూడు పంటల నుండి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

ఒకే పంటను పండించి నష్టపోతున్న రైతులు అంతర పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. నాలుగైదేళ్ల తర్వాత దిగుబడి వచ్చే ప్రధాన పంటల మధ్యలో అంతర పంటల్ని సాగు చేయడం వల్ల అధిక ఆదాయాన్ని పొందొచ్చు. తోటల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రధాన పంట కాపునకు వచ్చేంత వరకు అంతరపంటలు సాగు చేయవచ్చు. ఏక పంటగా ఏదో ఒక ఉద్యాన పంటను పండించడం కన్నా అంతర పంటలను పండించడం వల్ల ఒక పంట పోయినా మరో పంటతో ఆదాయాన్ని పొందవచ్చు.

పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం మండలం, గురవాయి గూడెం గ్రామ రైతు దల్లి రామాంజనేయరెడ్డి తనకున్న 11 ఎకరాలలో 20 ఏళ్ల క్రితం ఆయిల్ పామ్ సాగుచేపట్టారు. మొక్కల మధ్య దూరం ఉండటంతో 5 ఏళ్ల క్రితం కోకో పంటను వేశారు. దాంతో పాటు 4 ఏళ్ల క్రితం గజపిప్పిలి మొక్కలను నాటారు. ఇది మిరియాలు, తమలపాకు కుటుంబానికి చెందిన బహువార్షికపు తీగ జాతి పంట. దీని పండ్లు కంకులను పిప్పళ్లు అని, వేర్లను పిప్పలి మోడి అని పిలుస్తారు.

Hyderabad : హోటల్‌ లో లేడీస్ బాత్రూములో సీక్రెట్ కెమెరా

ఎక్కువగా శ్వాసకోస సంబంధిత వ్యాధుల నివారణకు, జీర్ణశక్తికి వీటిని వాడుతుంటారు. ఆయుర్వేదంలో వేర్లను, కడుపులో గ్యాస్ తగ్గించడానికి, లివర్ టానిక్ గాను ఉపయోగిస్తారు. కాయలను మూత్రం సులువుగా అవడానికి, కీళ్ల నొప్పులకు వాడతారు. ప్రస్తుతం ఇలా ఈ పంటల నుంచి మంచి నికర ఆదాయాన్ని పొందుతున్నారు.

సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవటం వంటి కారణాలతో వ్యవసాయంలో రైతు మనుగడ ప్రశ్నార్ధకమవుతున్నపరిస్థితుల్లో… ప్రతీ రైతు ఆదాయం పెంచుకునే దిశగా… ఆధునిక పరిజ్ఞానంతో, ప్రణాళికాబద్దంగా ముందడుగు వేయాల్సిన అవసరం వుంది. భవిషత్తులో రారాజు ఒక రైతు మాత్రమేనని ఘంటారథంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.