Ganga Snan in Haridwar: హరిద్వార్‌లో గంగా నదీ స్నానాలు రద్దు

గంగా దసరా, నిర్జల ఏకాదశి సందర్భంగా హరిద్వార్ లో నిర్వహించనున్న గంగా నదీ స్నానాలను రద్దు చేశారు. కొవిడ్ వ్యాప్తి పెరగకూడదనే ఉద్దేశ్యంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. హరిద్వార్ కు ఎక్కువ సంఖ్యలో హాజరుకాకూడదని అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

Ganga Snan in Haridwar: హరిద్వార్‌లో గంగా నదీ స్నానాలు రద్దు

Ganga River

Updated On : June 19, 2021 / 6:53 PM IST

Ganga Snan in Haridwar: గంగా దసరా, నిర్జల ఏకాదశి సందర్భంగా హరిద్వార్ లో నిర్వహించనున్న గంగా నదీ స్నానాలను రద్దు చేశారు. కొవిడ్ వ్యాప్తి పెరగకూడదనే ఉద్దేశ్యంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. హరిద్వార్ కు ఎక్కువ సంఖ్యలో హాజరుకాకూడదని అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ డి. సెంథిల్ అబుదై కృష్ణ రాజ్ ఎస్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం మొదలైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. జూన్ 20, 21 తేదీల్లో రాకూడదనే ఈ నిర్ణయం చేశామని అన్నారు.

ఈ రెండ్రోజుల్లో జిల్లా సరిహద్దులు కూడా మూసేయనున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని తిరిగి పంపించేస్తామని అన్నారు. 72గంటల లోపు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్టు రిపోర్టు పొందిన వారికి మాత్రమే హరిద్వార్ లోకి అనుమతిస్తారు.

పవిత్రమైన నదీ స్నానానికి కేవలం పురోహితులు, అధికారులు మాత్రమే హాజరుకానున్నారు. ప్రస్తుతం హర్ కీ పౌరీతో పాటు ఇతర ఘాట్ లలో నదీ స్నానాలను పూర్తిగా రద్దు చేసింది ప్రభుత్వం. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.