GHMC : ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సమాయత్తం

ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. గ్రేటర్లో ఐసోలేషన్ కేంద్రాలు గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఒక్కో సర్కిల్ లో ఒక్క ఐసోలేషన్ కేంద్రం గుర్తించాలని కమిషనర్ అన్నారు.

GHMC : ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సమాయత్తం

Ghmc

GHMC ready to face Omicron : ప్రపంచాన్ని విణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ భారత్ లో కూడా కలవరం రేపుతోంది. దేశంలో పలు కేసులు నమోదైన విషయం తెలిసింది. తెలంగాణలోనూ ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. రెండు కొత్త వేరియంట్ కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. కొత్త వేరియంట్ కట్టడికి తగిన చర్యలు తీసుకుంటుంది.

హైదరాబాద్ లో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కొత్త వేరియంట్ నిర్ధారణ అయింది. దీంతో నగరంలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సమాయత్తం అవుతోంది. గ్రేటర్ లో ఐసోలేషన్ కేంద్రాలు గుర్తించే పనిలో బల్దియా నిమగ్నమైంది. ఒక్కో సర్కిల్ లో ఒక్క ఐసోలేషన్ కేంద్రం గుర్తించాలని కమిషనర్ ఆదేశించారు.

Omicron Tension : తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్..వైద్యారోగ్య శాఖ అలర్ట్

కేసుల సంఖ్య పెరిగితే ఐసోలేషన్ కేంద్రాలను పెంచుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాదిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలను శానిటైజ్ చేసి బెడ్లను సిద్ధం చేయాలని మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో ఒక్కొక్కటిగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అటు ప్రభుత్వం.. ఇటు వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయ్యాయి. విమానాశ్రయాల్లోనే ఒమిక్రాన్‌ కేసులను గుర్తించి.. వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అక్కడ వారిని ఐసోలేషన్‌లో ఉంచి.. ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో కోవిడ్‌ పాజిటివ్‌గా తేలితే.. టిమ్స్‌కు తరలిస్తున్నారు.

Attack On Constable : మద్యం మత్తులో కానిస్టేబుల్ పై మందుబాబు దాడి

పాజిటివ్‌ వచ్చిన వారిని.. వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను కూడా టిమ్స్‌లోనే ఉంచి ట్రీట్‌మెంట్‌ అందజేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. టిమ్స్‌లో ఒమిక్రాన్ పేషెంట్ల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసులు పెరిగినా ఇబ్బంది లేదని టిమ్స్ సూపరింటెండెంట్‌ డాక్టర్ ఖాన్‌ అంటున్నారు.