Soft Drink: కూల్ డ్రింక్ తాగిన బాలిక.. కాసేపటికి మృతి!

కూల్ డ్రింక్ తాగిన ఓ బాలిక కాసేపటికే శరీరం నీలిరంగులోకి మారి మృతి చెందిన ఘటన ఒక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… చెన్నై‌లోని బీసెంట్ నగర్‌కి చెందిన సంతోష్, గాయత్రీ దంపతులకు తరణి, అశ్విని అనే ఇద్దరు కూతుళ్లున్నారు. రెండో కూతురైన ధరణి(13) గత మంగళవారం(ఆగస్టు3) దగ్గర్లోని కిరాణా షాప్‌లో కూల్‌డ్రింక్ ఇంటికి తెచ్చుకుంది.

Soft Drink: కూల్ డ్రింక్ తాగిన బాలిక.. కాసేపటికి మృతి!

Soft Drink

Soft Drink: కూల్ డ్రింక్ తాగిన ఓ బాలిక కాసేపటికే శరీరం నీలిరంగులోకి మారి మృతి చెందిన ఘటన ఒక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… చెన్నై‌లోని బీసెంట్ నగర్‌కి చెందిన సంతోష్, గాయత్రీ దంపతులకు తరణి, అశ్విని అనే ఇద్దరు కూతుళ్లున్నారు. రెండో కూతురైన ధరణి(13) గత మంగళవారం(ఆగస్టు3) దగ్గర్లోని కిరాణా షాప్‌లో కూల్‌డ్రింక్ ఇంటికి తెచ్చుకుంది. కాసేపటి అనంతరం బాలిక ఆ కూల్ డ్రింక్ తాగగా.. తాగిన ఐదు నిమిషాల్లోనే శరీరం నీలం రంగులోకి మారిపోయి ఉలుకూ పలుకూ లేకుండా అపస్మారక స్థితిలోకి చేరుకుంది.

Soft Drink

Soft Drink

ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేకపోగా చెల్లి పరిస్థితిని గమనించిన అక్క అశ్విని తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. దీంతో ఆందోళన గురైన ధరణి తల్లిదండ్రులు ధరణిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ధరణిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని నిర్థారించారు. దీంతో తమ కూతురు చనిపోవడానికి కారణం కూల్ డ్రింక్ అని ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూల్ డ్రింక్ అమ్మిన షాపు ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూల్ డ్రింక్ షాపును సీజ్ చేసి అందులోని డ్రింక్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని ల్యాబ్ కు తరలించారు. బాలిక తాగిన కూల్ డ్రింక్ కంపెనీ బాటిల్స్ మరో 17 మందికి అమ్మినట్లుగా గుర్తించిన పోలీసులు వారి వివరాలను కూడా కనుగొనే పనిలో పడ్డారు. ఇక బాలిక మృతదేహానికి నిర్వహించిన పోస్ట్ మార్టంలో ఆమె ఊపిరితిత్తులలో కూల్ డ్రింక్ చేరినట్లుగా గుర్తించారు. కాగా, ఆ బాలిక గతంలో ఆస్తమాతో బాధపడేదని విచారణలో తేలింది. దీంతో బాలిక ఆరోగ్య కారణాలతోనే మరణించిందా.. లేక కూల్ డ్రింక్ లో ఏదైనా విషపూరిత రసాయనాలను వాడారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.