Goa Congress: గోవాలో ఏం జరుగుతోంది.. బీజేపీతో టచ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలోకి వెళ్లే అవకాశాలున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో భేటీ అయ్యారని, త్వరలో వారు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. అయితే.. ఈ వార్తలను గోవా కాంగ్రెస్ చీఫ్ అమిత్ పాట్కర్ ఖండించారు. ఇవన్నీ పుకార్లేనని, కావాలనే బీజేపీ అలా ప్రచారం చేసుకుంటుందంటూ కొట్టిపారేశారు.

Goa Congress: గోవాలో ఏం జరుగుతోంది.. బీజేపీతో టచ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

Goa Congress Mla's

Goa Congress: గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలోకి వెళ్లే అవకాశాలున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో భేటీ అయ్యారని, త్వరలో వారు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. అయితే.. ఈ వార్తలను గోవా కాంగ్రెస్ చీఫ్ అమిత్ పాట్కర్ ఖండించారు. ఇవన్నీ పుకార్లేనని, కావాలనే బీజేపీ అలా ప్రచారం చేసుకుంటుందంటూ కొట్టిపారేశారు. మాకున్నది 11 మంది ఎమ్మెల్యేలు. వారిలో ఎనిమిది మంది కొత్తవారు. ఆదివారం ఫ్లోర్ మేనేజ్‌మెంట్ సమావేశం జరిగింది. మా సీనియర్ ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలతో పలు విషయాలపై చర్చించారు. నేను ఆశాజనకంగా ఉన్నాను. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం పాలనలో విఫలమైన గోవా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాం. కాంగ్రెస్ ప్రజా సమస్యలను సభలో లేవనెత్తడాన్ని సోమవారం మీరు చూస్తారంటూ పేర్కొన్నారు.

Goa Politics : కాంగ్రెస్ కు బిగ్ షాక్..టీఎంసీలో చేరిన గోవా మాజీ సీఎం

గోవా రాజకీయాలు హీటెక్కాయి. హస్తం పార్టీలో తిరుగుబాటు మొదలైందని, ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గోవా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. విపక్ష పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించేందుకు శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంకు పలువురు ఎమ్మెల్యేలు గౌర్హాజరవడం కాంగ్రెస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన దిగంబర్ కామత్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదు.

Sri Lanka Crisis: గొటబాయ విదేశాలకు పారిపోయాడా? అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే ఆ దేశ రాజ్యాంగం ఏం చెబుతుంది!

కాంగ్రెస్ తరపున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మైఖేల్ ను నియమించడంపై దిగంబర్ కామత్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వీరు కీలక సమావేశానికి వెళ్లకుండా బీజేపీ నేతలతో సమావేశం అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను కాంగ్రెస్ గోవా అధ్యక్షుడు అమిత్ పాట్కర్ ఖండించారు. బీజేపీ కావాలనే ఇలాంటి అసత్యాలను ప్రచారంచేస్తోందని అన్నారు. గోవాకు చెందిన మరో కాంగ్రెస్ నేత దినేష్ గుండూరావు మాట్లాడుతూ.. శనివారం పనాజీలో జరిగిన సమావేశంకు 11 మంది పార్టీ ఎమ్మెల్యే హాజరయ్యారంటూ తెలిపాడు. గోవా కాంగ్రెస్ నాయకుడు మైఖేల్ లోబో కూడా ఇవి పుకార్లేనని ఖండించారు. అసెంబ్లీ సమావేశానికి ముందు ఉద్దేశపూర్వకంగా బీజేపీ ఇలాంటి రాజకీయాలు చేస్తుందని ఆయన విమర్శించారు.

Telangana Holidays : భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు మూడు రోజులపాటు సెలవులు

ఈ ఏడాది ప్రారంభంలో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో అధికార బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)కి 25 మంది, ప్రతిపక్ష కాంగ్రెస్ కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. అయితే ఇటీవల 25మంది ఎమ్మెల్యేలు ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ఇతర పార్టీల ఎమ్మెల్యేల నుంచి మద్దతు లభిస్తుందని, ఈ ఏడాది చివరి నాటికి 30 మందితో మా ప్రభుత్వం కొనసాగుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సిటి రవి గత నెలలో అన్నారు. అప్పటి నుంచి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో 2019లో 15మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10మంది శాసనసభా పక్షాన్ని బీజేపీలో ‘విలీనం’ చేసి బీజేపీ ఎమ్మెల్యేలుగా మారిన సంగతి తెలిసిందే.