Sri Lanka Crisis: గొటబాయ విదేశాలకు పారిపోయాడా? అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే ఆ దేశ రాజ్యాంగం ఏం చెబుతుంది!

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే విదేశాలకు పారిపోయాడని ఆ దేశ మీడియా పేర్కొంటుంది. ఒకవేళ గొటబాయ విదేశాలకు పారిపోతే.. తదుపరి అధ్యక్షుడు ఎవరు? ఎలా ఎన్నుకుంటారు? రాజీనామాకు గొటబాయ నిరాకరిస్తే ఏం చేయాలని.. అనే అంశాలు ప్రతిఒక్కరి మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ అంశాలకు శ్రీలంక రాజ్యాంగంలో సమాధానాలు ఉన్నాయి.

Sri Lanka Crisis: గొటబాయ విదేశాలకు పారిపోయాడా? అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే ఆ దేశ రాజ్యాంగం ఏం చెబుతుంది!

Sri Lanka Precident

Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రజాప్రతినిధుల ఇండ్లపై దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే అధికారిక నివాసాన్ని లక్షలాది ఆందోళనకారులు ముట్టడించారు. పటిష్ఠ భద్రత ఉన్నప్పటికీ వాటిని చేధించుకొని వెళ్లి మరీ అధ్యక్ష నివాసంలోకి దూసుకెళ్లారు. ముందస్తు సమాచారం అందుకున్న అధ్యక్షుడు గొటబాయ రాజకపక్సే అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఆయన నేరుగా పోర్టుకు వెళ్లి అక్కడినుంచి నౌకల ద్వారా విదేశాలకు పారిపోయినట్లు ఆ దేశంలోని కొన్ని ప్రసార మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. నౌకలోకి కొందరు కొన్ని షూట్ కేసులు తీసుకెళ్తున్న వీడియోలు వైరల్ కావడంతో అధ్యక్షుడు నిజంగానే విదేశాలకు పారిపోయాడని చెప్పడానికి ఇవే నిదర్శనమంటూ అక్కడి మీడియా తన కథనాల్లో పేర్కొంటుంది.

Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభాన్ని చక్కదిద్దే పనిలో ఆర్మీ..శాంతియుత పరిష్కారానికి ప్రయత్నాలు

గొటబాయ పరారీ తరువాత.. ప్రధాని రణిల్ విక్రమసింఘెసైతం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే శనివారం అర్థరాత్రి సమయంలో ఆందోళనకారులు విక్రమసింఘై నివాసంపైనా దాడి చేశారు. పలువురు ఎంపీ, మాజీ ఎంపీల ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో పలువురు ప్రజాప్రతినిధులు తమ నివాసాల నుంచి వేరే ప్రాంతాలకు పారిపోయినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ప్రస్తుతం గొటబాయ విదేశాలకు వెళ్లిపోతే తదుపరి అధ్యక్షుడు ఎవరు? ఎలా ఎన్నుకుంటారు? రాజీనామాకు గొటబాయ నిరాకరిస్తే ఏం చేయాలని.. అనే అంశాలు ప్రతిఒక్కరి మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ అంశాలకు శ్రీలంక రాజ్యాంగంలో సమాధానాలు ఉన్నాయి.

Sri Lanka Crisis: రాజపక్సే నివాసంలో మద్యం బాటిళ్లు.. ఆందోళన కారులు ఏం చేశారో తెలుసా? వీడియోలు వైరల్

అధ్యక్షుడి పదవీకాలం పూర్తికాకముందే ఆ పదవి ఖాళీ అయితే ఏం చేయాలనే విషయాలు శ్రీలంక రాజ్యాంగంలో పేర్కొనబడ్డాయి. అధ్యక్ష పదవి ఖాళీ అయితే కొత్తవారిని నియమించుకొనే అవకాశం ఉంటుంది.  పార్లమెంట్ లో మరో సభ్యుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవచ్చు. మిగిలిన పదవీ కాలంలో మాత్రమే అధ్యక్షుడుగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అధ్యక్షుడు రాజీనామాచేస్తే మూడు రోజుల్లోగా పార్లమెంట్ సమావేశం కావాల్సి ఉంటుంది. నెలరోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ మొదలు కావాల్సి ఉంటుంది. అధ్యక్షుడి రాజీనామాపై పార్లమెంట్ సెక్రటరీ జనరల్ ప్రకటన చేస్తారు. ఆ తర్వాత సభ్యుల్లో ఒకరి కంటే ఎక్కువ మంది అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తే, సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే వరకు ప్రధాన మంత్రి ఆ పదవిలో కొనసాగొచ్చు. ప్రస్తుతం ప్రధాని విక్రమసింఘై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో.. స్పీకర్ అధ్యక్ష పదవిలో కొనసాగొచ్చు.

Sri Lanka Crisis: నేను కొనసాగలేను.. శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే రాజీనామా.. అదే బాటలో గొటబయ?

ఒకవేళ గొటబాయ రాజపక్సే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుంటే మూడు నెలలు ఆగాల్సిందే. అయితే రాజపక్సే మళ్లీ తిరిగివచ్చి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని తాము అనుకోవటం లేదని ఆ దేశ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఆర్మీ సాయంతో అతను అధ్యక్ష స్థానంలో కొనసాగే అవకాశాలు కొట్టిపారేయలేమని పేర్కొంటున్నారు. ఆందోళనకారులు మాత్రం గొటబాయ తన పదవికి రాజీనామా చేయాలని ఖరాఖండీగా చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గొటబాయ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభాన్ని చక్కదిద్దే పనిలో ఆర్మీ..శాంతియుత పరిష్కారానికి ప్రయత్నాలు

మరోవైపు ప్రధాని విక్రమసింఘై రాజీనామాతో ఇప్పట్లో ఆ దేశంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఆ పరిస్థితులు కూడా ప్రస్తుతం శ్రీలంకలో లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి, కొత్తవారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా ఇప్పట్లో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం మెరుగైన స్థితికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.