Sri Lanka crisis: శ్రీ‌లంక‌లో క‌ల‌క‌లం.. ఇంటి నుంచి అధ్య‌క్షుడు రాజ‌ప‌క్స ప‌రారీ

శ్రీలంక‌లో త‌లెత్తిన ప‌రిస్థితుల‌కు బాధ్య‌త‌వ‌హిస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున‌ ఆందోళన చేపట్టారు. రాజపక్స నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఈ నేప‌థ్యంలో గొటబాయ రాజపక్స ఇంటి నుంచి పారిపోయినట్లు శ్రీ‌లంక‌ రక్షణ శాఖ వెల్ల‌డించింది.

Sri Lanka crisis: శ్రీ‌లంక‌లో క‌ల‌క‌లం.. ఇంటి నుంచి అధ్య‌క్షుడు రాజ‌ప‌క్స ప‌రారీ

Sri Lanka

Sri Lanka crisis: ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. శ్రీలంకలో సంక్షోభానికి, ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతుండ‌డానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఆయన సోదరుడు మహింద రాజపక్స కారణమని ప్రతిపక్షాలు, ప్రజలు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. శ్రీలంక‌లో త‌లెత్తిన ప‌రిస్థితుల‌కు బాధ్య‌త‌వ‌హిస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఇవాళ వారు పెద్ద ఎత్తున‌ ఆందోళన చేపట్టారు. రాజపక్స నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఈ నేప‌థ్యంలో గొటబాయ రాజపక్స ఇంటి నుంచి పారిపోయినట్లు శ్రీ‌లంక‌ రక్షణ శాఖ వెల్ల‌డించింది.

Amalapuram: తోటి ఉద్యోగుల ముందే కుప్పకూలి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఆహారంతో పాటు చమురు, ఔష‌ధాలు లేకపోవడం, విద్యుత్తు కోతల వ‌ల్ల‌ ప్రజాందోళనలు తీవ్ర రూపం దాల్చ‌డంతో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. గొటబాయ రాజపక్స నివాసం వ‌ద్దకు భారీగా చేరిన ఆందోళనకారులపై భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కాల్పులు జరుపుతున్నట్లు తెలిసింది. గతంలోనూ ప్రధాని మహింద రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించటంతో ఆయ‌న కూడా అప్ప‌ట్లో పారిపోయారు.