Gold Price  : పసిడి ప్రియులకు షాక్.. హైదరాబాద్‌లో రూ.50 వేలు దాటిన బంగారం ధర

బంగారం వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని బులియన్ నిపుణులు చెబుతున్నారు.

Gold Price  : పసిడి ప్రియులకు షాక్.. హైదరాబాద్‌లో రూ.50 వేలు దాటిన బంగారం ధర

Dhanteras Gold Prices Huge Hike

Gold Price  : బంగారం వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని బులియన్ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.760 పెరిగి, 50,070 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.700 మేర ఎగసి రూ. 45,900 స్థాయిని అందుకుంది. ఇక శుక్రవారం తులం బంగారంపై రూ.90 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

చదవండి : Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340 గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,200 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070 గా ఉంది.

చదవండి : Today Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070 గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,070 గా ఉంది.

వెండి ధరలు :
పుత్తడి బాటలోనే వెండి ధర సైతం జోరుగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,300 మేర పుంజుకుని, రూ. 70,600కు చేరింది. క్రితం రోజు ఇది రూ. 69,300గా ఉంది. ప్రపంచ మార్కెట్లో వెండి ఔన్సు ధర 25 డాలర్ల స్థాయిని దాటింది.