Gold Rate : శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు

గడిచిన ఐదు రోజుల్లో బంగారం ధర నాలుగు సార్లు తగ్గగా.. ఓ సారి పెరిగాయి. బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటం ఒకింత శుభపరిణామమే అని చెప్పొచ్చు.

Gold Rate : శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు

Gold Rate (3)

Gold Rate : గడిచిన ఐదు రోజుల్లో బంగారం ధర నాలుగు సార్లు తగ్గగా.. ఓ సారి పెరిగాయి. బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటం ఒకింత శుభపరిణామమే అని చెప్పొచ్చు.. బంగారం కొనుగోలు చెయ్యాలి అనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెబుతున్నారు బులియన్ నిపుణులు. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర భారీగా తగ్గింది.

Read More :  Bill Gates – Jeff Bezos: మూడేళ్లుగా ఆ కంపెనీలో బిల్ గేట్స్.. జెఫ్ బెజోస్ పెట్టుబడులు

ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 క్షిణించి రూ.48110కి చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 తగ్గుదలతో రూ.44,100కు దిగొచ్చింది.

ఇక వెండి ధర విషయానికి వస్తే.. ఆదివారం రూ.1100 తగ్గడంతో కేజీ వెండి రూ.68,500కు లభిస్తోంది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లోని బంగారం ధరలను ఓ సారి పరిశీలిద్దాం

 

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,070 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,070 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

Read More : Cinema Folk Songs: వెండితెరపై మోత మోగిస్తున్న జానపదం!

 

తిరువనంతపురం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,110 ఉంది.

అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉంది.