తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్

తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగించింది.

  • Published By: naveen ,Published On : June 1, 2020 / 02:09 PM IST
తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్

తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగించింది.

తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగించింది. అదనంగా మరో రెండు గంటలు అంటే ఇకపై రాత్రి 8 గంటల వరకూ వైన్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. లాక్ డౌన్ 4లో రాత్రి 7 నుంచి కర్ఫ్యూ ఉండటంతో సాయంత్రం 6 గంటలకే మద్యం షాపులు బంద్ చేసేవారు. కానీ, లాక్ డౌన్ 5 లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ సమయాన్ని కేంద్రం మార్చిన సంగతి తెలిసిందే. దీంతో మరో రెండు గంటల పాటు అంటే రా.8 గంటల వరకు మద్యం దుకాణాలు కూడా తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

2 గంటలు అదనంగా అమ్మకాలకు అనుమతి:
లాక్‌డౌన్ 5.0ను కేంద్రం విధించినప్పటికీ.. ఆంక్షలను కేవలం కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. అలాగే కర్ఫ్యూ సమయాన్ని తగ్గించారు. దీంతో.. దాదాపు అన్ని షాపులు కంటైన్మెంట్ జోన్లలో తప్ప అన్ని చోట్ల యధావిధిగా తెరిచి ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కూడా రాత్రి 8 గంటల వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచనున్నారు. దీంతో అదనంగా మరో 2 గంటల పాటు మద్యం కొనుగోలుకు అవకాశం కలగడంతో మందుబాబులు మరింత సంబరపడుతున్నారు. ఈ నిర్ణయంతో లిక్కర్ సేల్స్ కొద్దిమేర పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వానికి కూడా మరికొంత ఆదాయం లభించనుంది.

రికార్డ్ స్థాయిలో లిక్కర్ సేల్స్:
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మద్యం షాపులు మూసివేశారు. అయితే లాక్ డౌన్ 4 లో సడలింపులకు అనుగుణంగా వైన్ షాపులు తెరిచేందుకు అనుమతిచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు షాపులు ఓపెన్ చేశారు. ఏకంగా రెండు నెలల తరువాత షాపులు ఓపెన్ కావడంతో మందుబాబులు ఒక్కసారిగా మందు షాపులపై పడ్డారు. భారీ సంఖ్యలో క్యూలు కట్టారు. దేశంలోని అన్ని చోట్ల రెండు రోజులపాటు ఇదే రకమైన పరిస్థితులు కనిపించాయి. తొలి రెండు మూడు రోజులు రికార్డ్ స్థాయిలో మద్యం సేల్స్ జరిగాయి. రాష్ట్రాలకు భారీగానే ఆదాయం వచ్చింది.