Gopichand Malineni : యంగ్ డైరెక్టర్స్ అంతా మహేష్ తో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు

ఈ ఈవెంట్ లో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ''సర్కారు వారి పాట ట్రైలర్ చూడగానే నా సౌండ్ ఆఫ్. మహేష్ గారు చాలా స్టయిలిష్ గా, మాస్ గా ఉన్నారు. మహేష్ గారితో.............

Gopichand Malineni : యంగ్ డైరెక్టర్స్ అంతా మహేష్ తో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు

Gopichand Malineni

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

Anil Ravipudi : ఇది సర్కారు వారి పాట కాదు.. మహేష్ వారి పాట..

ఈ ఈవెంట్ లో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ”సర్కారు వారి పాట ట్రైలర్ చూడగానే నా సౌండ్ ఆఫ్. మహేష్ గారు చాలా స్టయిలిష్ గా, మాస్ గా ఉన్నారు. మహేష్ గారితో యంగ్ డైరెక్టర్స్ అందరూ చేస్తున్నారు. చాలా మంచి విషయం. డైరెక్టర్ బుజ్జి బాగా చూపించాడు మహేష్ గారిని. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ అల్ ది బెస్ట్. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.