Dog Bite Control Guidelines: అంబర్‌పేట ఘటనపై ప్రభుత్వం సీరియస్.. కుక్క కాటు నియంత్రణకు మార్గదర్శకాలు జారీ

నగరంలో వీధి కుక్కల దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కుక్కలకు వేగంగా కుటుంబ నియంత్రణతో పాటు, పలు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కుక్క కాటుకు దూరంగా ఉండేలా ప్రభుత్వం పదమూడు పాయింట్స్‌తో మార్గదర్శకాలను జారీ చేసింది.

Dog Bite Control Guidelines: అంబర్‌పేట ఘటనపై ప్రభుత్వం సీరియస్.. కుక్క కాటు నియంత్రణకు మార్గదర్శకాలు జారీ

Dog bite

Dog Bite Control Guidelines: హైదరాబాద్‌ నగరం అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కుక్కలు బాలుడిపై దాడిచేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఘటన అనంతరం భాగ్యనగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని, వాటి నిర్మూలనలో ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీధి కుక్కలు బాలుడిపై దాడిచేసిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరెవరికి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా కుక్క కాటు నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 13 పాయింట్స్‌తో ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

Stray Dog Bites 40 People In 2 Hours : వీధికుక్క వీరంగం..2 గంటల్లో 40మందిపై దాడి, క్రిక్కిరిసిపోయిన ఆస్పత్రి ఎమర్జన్సీ వార్డు

మార్గదర్శకాలు.. 

♦  కుక్కల కుటుంబ నియంత్రణ వేగవంతం చేయడం.

♦  కుక్కలు ఎక్కువ గా ఉన్న ప్రాంతాలను గుర్తించి కుక్క కాటు ప్రమాదాల నియంత్రణ.

♦  జీహెచ్ఎంసీ పరిధి‌లో హెల్ప్ లైన్ నెంబర్ 04021111111 పై అవగాహన కల్పించండం.

♦  మాసం దుకాణాలు, హోటల్స్ నిర్వాహకులు వ్యర్థాలను రోడ్లపై వేయకుండా జీహెచ్ఎంసీ వాహనాల్లో మాత్రమే వేసేలా అవగాహన కల్పించడం.

♦  కుక్కల స్థితి‌ని ghmc, స్వచ్ఛంద సంస్థలతో ప్రజలకు అవగాహన కల్పించాలి.

♦  స్కూల్స్‌లో విద్యార్థులు వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలని వివరించాలి.

♦  కాలనీ సంఘాలు, బస్తీలలో వచ్చే‌ నెల రోజులు కుక్క కాటు‌పై అవగహన కల్పించాలి.

♦  Ghmc పరిధిలో ఉన్న అన్ని రకాల శానిటేషన్ సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి.

♦  కాలనీలే కాకుండా, మూసీ పరిసర ప్రాంతాల్లో, చెట్లు ఎక్కువ ప్రాంతాల్లో‌ని కుక్కలకు సైతం ఆపరేషన్ వేయడం, రేబిస్ టీకా వేయడం చేయాలి.

♦  వీధి కుక్కలు దత్తత తీసుకోవడం పై అవగహన.

♦  కుక్క కాటుకు గురైన వారి పూర్తి వివరాలు సేకరించి సరైన సమయంలో వైద్యం, ఇతర సహకారాలు అందించడం.

♦  వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలన్న దానిపై హోర్డింగ్స్, పోస్టర్స్, బిల్ బోర్డ్స్‌తో ప్రచారం.

♦  వీధి కుక్కల‌కోసం ప్రజలకు దూరంగా నీటి పాత్రలు జీహెచ్ఎంసీ అందుబాటులో ఉంచాలి