Groom As Photographer : తన పెళ్లికి తానే ఫోటోలు తీసుకున్న వరుడు .. వధువుని డిఫరెంట్ యాంగిల్స్‌లో క్లిక్ చేసి భలే వైరల్ అయ్యారుగా..

తన పెళ్లికి తానే ఫోటోలు తీసుకున్న వరుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. వధువుని పర్ ఫెక్ట్ లైటింగ్ తో డిఫరెంట్ యాంగిల్స్‌లో క్లిక్ చేసి భలే వైరల్ అయ్యారీ నవ వధూవరులు.

Groom As Photographer : తన పెళ్లికి తానే ఫోటోలు తీసుకున్న వరుడు .. వధువుని డిఫరెంట్ యాంగిల్స్‌లో క్లిక్ చేసి భలే వైరల్ అయ్యారుగా..

Groom As Photographer Own wedding

Groom As Photographer : పెళ్లంటే మూడు ముళ్లు ఏడు అడుగులు అనేవారు. కానీ ఇప్పుడు వినూత్నంగా ఫోటో షూట్లు, వధు వరుల డ్యాన్స్ లు..హడావిడి హంగామా..ట్రెండ్స్ కే నయా ట్రెండ్ సెట్ చేస్తున్నారు యువత. కలిసి షాపింగులు..వెడ్డింగ్ ఈవెంట్ డిస్కర్షన్లతో యువత అన్నీ పక్కా ప్లాన్ తో చేసుకుంటున్నారు. తమ వైవాహిక జీవితంలో తమ పెళ్లిని ఓ తీయని మరపురాని జ్ఞాపకంగా ఉంచుకోవాలనే ఆలోచనతో కొత్తగా ఆలోచించి వినూత్నంగా గుర్తులను పదిలం చేసుకోవటానికి సరికొత్తగా ఆలోచిస్తున్నారు.

ఒకప్పుడు వధువు పెళ్లి పీటలమీద సిగ్గుపడుతు తల వంచుకుని కూర్చునేది. అలాగే తాళికట్టించుకునేది. ఇప్పుడలా కాదు. వరుడితో షాపింగ్ లు..ఫోటో షూటుల్లో కలివిడిగా కలిసిపోతున్నారు. ఆ మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తిండిపోయేలా ఉండేందుకు వధువరులు కూడా డిఫరెంట్‌ యాంగిల్స్‌ ట్రై చేస్తున్నారు. అటువంటి ఓ వరుడు తన పెళ్లికి తానే ఫొటో గ్రాఫర్ అయితే వధువుని ఇంకెంత బాగా ఫోటోలు తీస్తాడో కదా..ఇదిగో ఈ వరుడు కూడా ఫోటో గ్రాఫర్ అనుకుంటా. అందుకే వధువుని డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలు క్లిక్ క్లిక్ మనిపిస్తున్నాడు. డిఫరెంట్‌గా ఆలోచించిన ఈ వరుడు తన పెళ్లిలో వధువు ఫొటోలను డిఫరెంట్‌ యాంగిల్స్‌లో క్లిక్‌మనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వెడ్డింగ్ లో వరుడే ఫోటో గ్రాఫర్ కావటం వధువుకు మరింత కంఫ్టర్ అనే చెప్పాలి. అలా ఫొటోగ్రాఫ‌ర్ ఆయ‌న్ సేన్.. ప్రియ‌తో ఏడ‌డుగులు వేశాక కెమెరాను అందుకున్నాడు. ప‌ర్ఫెక్ట్ లైటింగ్‌తో నవ వ‌ధువు ఫొటోలు తీశాడు. ఈ వీడియోను స్లైన్ ఫోటో-గ్రాఫిక్స్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయటంతో ఈ వీడియో32 ల‌క్ష‌ల వ్యూస్ ల‌భించాయి. నూత‌న దంప‌తుల‌ను అభినందనలు కురుస్తున్నాయి. వావ్ అంటూ ఇన్ స్టా యూజర్లు అబ్బురపడుతు కామెంట్స్ వరదపారిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Scylen Photo-Graphics (@wedding_photographer_scylen)