Gujarat: మరోమారు ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూపేంద్ర పటేల్.. సోమవారం ప్రమాణ స్వీకారం

ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరమే తదుపరి ముఖ్యమంత్రి పటేలేనని నరేంద్రమోదీ ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఎంపిక నామమాత్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంపిక అనేది ఎప్పుడో జరిగిపోయింది. శనివారం జరిగిన తంతు కేవలం చట్టబద్ధంగా నిర్వహించిందే

Gujarat: మరోమారు ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూపేంద్ర పటేల్.. సోమవారం ప్రమాణ స్వీకారం

Gujarat BJP MLAs elected Bhupendra Patel as next CM

Gujarat: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రాజీనామా చేసిన కాసేపటికే తిరిగి మరోమారు ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం రాష్ట్ర రాజధాని గాంధీనగర్‭లో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. కేంద్ర పార్లమెంటరీ నేతలు రాజ్‭నాథ్ సింగ్, బీఎస్ యడియూరప్ప, అర్జున్ ముండా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో భూపేంద్ర పటేల్ పేరును కాను దేశాయి ప్రతిపాదించారు. భూపేంద్రకు పోటీగా సీఎం రేసులోకి ఎవరూ రాకపోవడంతో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆయనకు మద్దతు తెలిపారు.

UK Army: బ్రిటన్ ఆర్మీపై జంతు హక్కుల రక్షణ సంస్థ ‘పెటా’ కేసు.. తమ టోపీలు వాడేలా చూడాలని పిటిషన్

ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరమే తదుపరి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేలేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. వాస్తవానికి నేటి ఎమ్మెల్యేల ఎంపిక నామమాత్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంపిక కొద్ది రోజుల క్రితమే జరిగిపోయింది. శనివారం జరిగిన తంతు కేవలం చట్టబద్ధంగా నిర్వహించిందే. ఇది కూడా పార్టీ అధిష్టాన ఆదేశాల అనుసారమే జరిగినట్లు సమాచారం. ఇక సోమవారం (డిసెంబర్ 12)న గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Sania Mirza: సానియా మీర్జాతో విడాకులు.. స్పందించిన షోయబ్ మాలిక్.. ఏం చెప్పాడంటే

182 నియోజకవర్గాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బంపర్ మెజారిటీతో గెలుపొందింది. మొత్తంగా 156 స్థానాలను గెలుచుకుని అన్ని రికార్డులు తిరగరాసింది. గతంలో ఈ రికార్డు కాంగ్రెస్ పేరుపై ఉండేది. 1985లో కాంగ్రెస్ పార్టీ 149 స్థానాలను గెలుచుకుంది.