Gujarat: పంచాయత్ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం

గుజరాత్‌లోని వడోదర పట్టణంలో పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. దీంతో పరీక్షను జీపీఎస్ఎస్‌బీ రద్దు వేసింది. వీలున్నంత త్వరగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన తేదీని తొందర్లోనే ప్రకటిస్తామని జీపీఎస్ఎస్‌బీ వెల్లడించింది.

Gujarat: పంచాయత్ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం

Gujarat: గుజరాత్‌లో ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం కలకలం సృష్టించింది. గుజరాత్ పంచాయత్ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ ఆదివారం లీకైంది. దీంతో ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసింది. జీపీఎస్ఎస్‌బీ (గుజరాత్ పంచాయత్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్) ఆధ్వర్యంలో ఈ పరీక్ష ఆదివారం, జనవరి 29న జరగాల్సి ఉంది.

#MannKiBaat: తెలంగాణకు చెందిన విజయ్ అనే ఇంజనీర్ చేసిన‌ పోస్ట్ ను చూశాను: మోదీ

అయితే, గుజరాత్‌లోని వడోదర పట్టణంలో పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. దీంతో పరీక్షను జీపీఎస్ఎస్‌బీ రద్దు వేసింది. వీలున్నంత త్వరగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన తేదీని తొందర్లోనే ప్రకటిస్తామని జీపీఎస్ఎస్‌బీ వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన అసౌకర్యం విషయంలో విచారం వ్యక్తం చేసిన బోర్డు, అభ్యర్థులెవరూ పరీక్షా కేంద్రాలకు రాకూడదని సూచించింది. ఈ పరీక్ష ద్వారా 1,195 పంచాయత్ జూనియర్ క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఈ పరీక్షకు మొత్తం 9.5 లక్షల మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2,995 పరీక్షా కేంద్రాల్ని ప్రభుత్వం సిద్ధం చేసింది.

Odisha Minister Naba Das: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు

ఈ పేపర్ లీకేజికి సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఆదివారం వేకువఝామున ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడి దగ్గరి నుంచి ఒక ప్రశ్నాపత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లో పేపర్ లీక్ కావడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ పాలనలో వరుసగా పేపర్లు లీక్ అవుతూ, పరీక్షలు రద్దు అవుతున్నాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. గడిచిన 12 ఏళ్లలో 15 సార్లు పరీక్షలు రద్దయ్యాయని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.