Odisha Minister Naba Das: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు

ఒడిశాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఏకంగా ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి నబ కిశోర్‌దాస్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడం ద్వారా మంత్రికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే భద్రతా సిబ్బంది మంత్రిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Odisha Minister Naba Das: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు

Odisha Minister

Odisha Minister Naba Das: ఒడిశాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఏకంగా ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి నబ కిశోర్‌దాస్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడం ద్వారా మంత్రికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. వెంటనే భద్రతా సిబ్బంది మంత్రిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఝార్సుగూడ బ్రిజరాజ్ నగర్‌లోని గాంధీచౌక్ వద్ద మంత్రి పై కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్లారు. తన కారుదిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు దగ్గరి నుండి కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో మంత్రి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

Odisha: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒడిశా సీఎం సంచలన నిర్ణయం.. 22 కులాలను SEBC జాబితాలోకి

అయితే, మంత్రిపై కాల్పులు జరిపింది ఎవరనేది తెలియాల్సి ఉంది. కాల్పుల విషయం తెలుసుకున్న బీజేడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. దీంతో ఘటన స్థలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాల్పుల ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం జల్లెడపడుతున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ కాల్పులు జరిపారని పోలీసులు భావిస్తున్నారు. భద్రతా సిబ్బంది, పోలీసులు ఉన్నప్పటికీ కాల్పుల ఘటన చోటు చేసుకోవటంతో భద్రత చర్యలపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలాఉంటే 2024లో ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాల్పుల ఘటన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ. ఎన్నికల సమయంలో హింసకు గురైన చరిత్ర గతంలో ఒడిశాలో ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

 

ఇదిలాఉంటే.. బిజూ జనతా దళ్ (బీజేడీ) సీనియర్ నాయకుడు నబా దాస్. ఇటీవల మహారాష్ట్రంలోని ఓ ఆలయానికి రూ. కోటికిపైగా విలువైన బంగారంను విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. దేశంలోని ప్రసిద్ధ శని పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయానికి నబా దాస్ 1.7కిలోల బంగారం, ఐదు కిలోల వెండితో చేసిన కలశాలను విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.