Odisha: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒడిశా సీఎం సంచలన నిర్ణయం.. 22 కులాలను SEBC జాబితాలోకి

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సంఖ్య ఇప్పటికే 54శాతం ఉంది. అయితే తాజా కులాల చేరికతో వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది నవీన్ నేతృత్వంలోని బిజూ జనతా దశ్ పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నవీన్ పట్నాయక్ తాజాగా ఎస్ఈబీసీలోకి చేర్చుతున్నట్లు ప్రకటించిన 22 కులాలు ఇప్పటికే ఓబీసీలో ఉన్నాయని బీజేపీ విమర్శించింది. 1993లోనే వీరిని ఓబీసీలోకి కేంద్ర ప్రభుత్వం చేర్చినట్లు బీజేపీ నేత సూరత్ బిశ్వాల్ తెలిపారు.

Odisha: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒడిశా సీఎం సంచలన నిర్ణయం.. 22 కులాలను SEBC జాబితాలోకి

Odisha clears inclusion of 22 castes in SEBC list

Odisha: ఒడిశా అసెంబ్లీకి 2024 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నికల వాతావరణం ప్రవేశించదనే చెప్పాలి. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఒడిశాను సుదీర్ఘకాలంగా పాలిస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 22 కులాలను ఎస్ఈబీసీ (Socially and Economically Backward Classes.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలు) జాబితాలోకి మార్చనున్నట్లు శనివారం ప్రకటించారు. ఒకవైపు బిహార్ ప్రభుత్వం కేంద్రాన్ని ధిక్కరించి కులగణన ప్రారంభించిన నేపథ్యంలో సీఎం నవీన్ తీసుకున్న ఈ నిర్ణయం.. విపక్ష పార్టీలను ఇబ్బందికి గురి చేస్తోంది.

Shah Rukh Khan: చరణ్ తీసుకెళ్తే పఠాన్ సినిమా చూస్తానంటోన్న కింగ్ ఖాన్!

కారణం, దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఓబీసీలు తమ డిమాండ్ల గురించి చైతన్యం అయితే రాజకీయ పార్టీలకు పెద్ద ఇబ్బంది వచ్చినట్టే. ఇప్పటికే వారి నుంచి చట్టసభల్లో రిజర్వేషన్లతో పాటు ప్రస్తుతం ప్రభుత్వ విద్య, ఉద్యోగ రంగాల్లో ఉన్న రిజర్వేషన్ల కోటాను పెంచాలనే డిమాండ్ ఉంది. దీనికి తోడు కులగణనపై కూడా చాలా కాలంగా డిమాండ్ కొనసాగుతోంది. ఈ తరుణంలో నవీన్ తీసుకున్న నిర్ణయం కారణంగా పై రెండు అంశాలపై ఒడిశాలో కూడా డిమాండ్ పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Congress Charge Sheet: బీజేపీ మీద “ఛార్జ్ షీట్” విడుదల చేసిన కాంగ్రెస్

ఇకపోతే.. తాజాగా ఎస్ఈబీసీలో చేర్చిన జాబితాలో వడ్రంగి, బింద్నీ, బిందానీ, బరాజీ, బరోయి, శంఖువా తంతి, గోల తంతి, లజ్య్ నిబారణ్, హంసీ తంతి, కపాడియా, గంధమాలి, థానపతి, పండర మాలి, పనియర్ మాలి, పండరియా, ఓడి-ఖండయాత్, బయలిషా, ఓడ, ఓడ-పాయికా పైకో, హల్దియా-తెలి, కలంది అనే కులాలు ఉన్నాయి. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సంఖ్య ఇప్పటికే 54శాతం ఉంది. అయితే తాజా కులాల చేరికతో వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది నవీన్ నేతృత్వంలోని బిజూ జనతా దశ్ పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నవీన్ పట్నాయక్ తాజాగా ఎస్ఈబీసీలోకి చేర్చుతున్నట్లు ప్రకటించిన 22 కులాలు ఇప్పటికే ఓబీసీలో ఉన్నాయని బీజేపీ విమర్శించింది. 1993లోనే వీరిని ఓబీసీలోకి కేంద్ర ప్రభుత్వం చేర్చినట్లు బీజేపీ నేత సూరత్ బిశ్వాల్ తెలిపారు.