#MannKiBaat: తెలంగాణకు చెందిన విజయ్ అనే ఇంజనీర్ చేసిన పోస్ట్ ను చూశాను: మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో మాట్లాడారు. పద్మ అవార్డులు, దేశ సాధిస్తోన్న పురోగతి, వాతావరణం, ఈ-వేస్ట్ తదితర అంశాల గురించి ప్రస్తావించారు. నమో యాప్ లో తాను తెలంగాణ కు చెందిన విజయ్ అనే ఇంజనీర్ పోస్ట్ ను చూశానని ప్రధాని మోదీ అన్నారు. అతడు ఈ-వేస్ట్ గురించి రాశారని తెలిపారు.

#MannKiBaat: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో మాట్లాడారు. పద్మ అవార్డులు, దేశ సాధిస్తోన్న పురోగతి, వాతావరణం, ఈ-వేస్ట్ తదితర అంశాల గురించి ప్రస్తావించారు. నమో యాప్ లో తాను తెలంగాణ కు చెందిన విజయ్ అనే ఇంజనీర్ పోస్ట్ ను చూశానని ప్రధాని మోదీ అన్నారు. అతడు ఈ-వేస్ట్ గురించి రాశారని తెలిపారు.
విజయ్ ఈ విషయాన్ని గురించి మన్ కీ బాత్ లో మాట్లాడాలని కోరారని మోదీ అన్నారు. సరికొత్త ప్రయత్నాలు చేస్తున్న స్టార్టప్స్ చాలా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం సుమారు 500 ఈ-వేస్ట్ రీసైక్లర్స్ ఈ రంగంతో ముడిపడి ఉన్నాయని మోదీ తెలిపారు.
ఇంకా ఎన్నో కొత్త సంస్థలను తీసుకువస్తున్నారని చెప్పారు. ఈ-రంగం ద్వారా వేలాది మందికి నేరుగా ఉపాధి వచ్చిందని తెలిపారు. ఈ-వేస్ట్ సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడే వాటి గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. ప్రతి ఏడాది కేవలం 15 నుంచి 17 శాతం ఈ-వేస్ట్ ను మాత్రమే రీసైకిల్ చేస్తున్నామని అన్నారు. ఇండియా ది మదర్ ఆఫ్ డెమోక్రసీ పుస్తకం గురించి, కాకతీయుల పాలన గురించి కూడా మోదీ ప్రస్తావించారు.
తాము కళల అభ్యున్నతికి పాటుపడుతున్న వారిని గుర్తించామని, అనేక మంది కళాకారులను పద్మ అవార్డులు వరించాయని చెప్పారు. సంగీతాన్ని ఇష్టపడని వారుఎవరు ఉంటారు? అని అడిగారు. మన కృషి వల్లే యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు.
యోగా, చిరుధాన్యాల దినోత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు. చిరుధాన్యాలు, యోగా వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. ఏపీలోని నంధ్యాల జిల్లాకు చెందిన కె.వి.రామ సుబ్బారెడ్డి చిరుధాన్యాల కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశారని చెప్పారు. అతడి తల్లి చిరుధాన్యాలతో చేసే వంటకాలను రుచి చూసి, తన గ్రామంలో సజ్జల ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించారని చెప్పారు.
ఈ సారి దేశంలో చలి బాగా పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. కొండ ప్రాంతాల్లో మంచు కురవడాన్ని ప్రజలు బాగా ఆస్వాదించారని అన్నాఉ. కశ్మీర్ లో ఇటువంటి చిత్రాలు దేశ ప్రజలందరి మనసులూ దోచాయని చెప్పారు. సామాజిక మాధ్యమాలలో ఈ చిత్రాలు కనపడ్డాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూశారని తెలిపారు. బనిహాల్ నుంచి బడ్గాం వెళ్లే రైలు వీడియోను కూడా ప్రజలు చాలా మంది చూస్తున్నారని అన్నారు.