Jitan Ram Manjhi: బిహార్ మహా కూటమిలో పేలిన బాంబ్.. కొడుకును సీఎం చేయాలంటూ మాజీ సీఎం డిమాండ్

బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొందరలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇక ఆయన స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్‭ను కూర్చోబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల నుంచి నితీశ్ తొందరలోనే తప్పుకుని సీఎం కుర్చీ ఖాళీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో నితీశ్ పార్టీలో ఉండడమే కాకుండా, ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన జితన్ రాం మాంఝీ

Jitan Ram Manjhi: బిహార్ మహా కూటమిలో పేలిన బాంబ్.. కొడుకును సీఎం చేయాలంటూ మాజీ సీఎం డిమాండ్

HAM chief Jitan Ram Manjhi pushes to make his son CM

Updated On : February 18, 2023 / 11:27 AM IST

Jitan Ram Manjhi: బిహార్ రాష్ట్రంలోని మహా గట్‭బంధన్(మహా కూటమి)లోని భాగస్వామి అయిన హిందుస్థానీ ఆవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) అధినేత జితన్ రామ్ మాంఝీ శుక్రవారం బాంబు పేల్చారు. మంత్రిగా ఉన్న తన కుమారుడు సంతోష్ సుమన్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేసులో ఉన్న రాష్ట్రీయ్ జనతా దళ్ కీలక నేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ కంటే కూడా తన కుమారుడే అందుకు అర్హుడంటూ ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు చిన్నవాడైనప్పటికీ, సీఎం పదవి కోసం ప్రచారం చేసుకుంటున్న వారి కంటే ఎక్కువ చదువుకున్నాడని మాంఝీ వాదించారు.

Pawar on Shiv Sena: శివసేనపై ఈసీ నిర్ణయం అనంతరం ఉద్ధవ్ థాకరేకు శరద్ పవార్ కీలక సూచన

“సంతోష్ ఎన్ఈటీ క్వాలిఫై అయ్యాడు. అంతే కాదు, ఈ ముఖ్యమంత్రి అభ్యర్థులకే పాఠాలు చెప్పేంతటి ప్రొఫెసర్” అని మాంఝీ వ్యాఖ్యానించారు. సీఎం అయ్యేందుకు చదువుతో పాటు తన కుమారుడికి మరిన్ని అర్హతలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అందులో ముఖ్యమైంది అతడు ‘భుయాన్’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తని (బిహార్‭లో అత్యంత వెనుకబడిన దళిత సామాజికవర్గం) ఆయన అన్నారు. అయితే రాష్ట్రంలో వెనుకబడిన కులాల జనాభా ఎక్కువ. పైగా మండల్ ఉద్యమ ప్రభావంతో ఓబీసీ నాయకత్వం రాష్ట్రంలో బలంగా ఉంది. అయినప్పటికీ ఓబీసీలు వెనుకబడే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ‘వెనుకబడిన వారి అభ్యున్నతి దళిత నాయకత్వంతోనే సాధ్యం’ అని మాంఝీ అన్నారు.

NOTA Banner: బ్రాహ్మణ వ్యక్తికి టికెట్ ఇవ్వలేదని, బ్రాహ్మణ ఓటర్లు నోటాకు ఓటేయాలంటూ బ్యానర్లు

బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొందరలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇక ఆయన స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్‭ను కూర్చోబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల నుంచి నితీశ్ తొందరలోనే తప్పుకుని సీఎం కుర్చీ ఖాళీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో నితీశ్ పార్టీలో ఉండడమే కాకుండా, ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన జితన్ రాం మాంఝీ.. పార్టీ హైకమాండ్ ఆదేశాలు పాటించలేదని బహిష్కరణకు గురయ్యారు. దానికి రివేంజ్ తీర్చుకోవడంతో పాటు తన లోటును భర్తీ చేసుకునేందుకు తాజాగా కుమారుడిని తెరపైకి తీసుకువచ్చారు జితన్ రాం మాంఝీ.