Hansika Motwani: యాపిల్ బ్యూటీ ప్రయోగం.. 105 నిమిషాలు.. సింగిల్ షాట్!

అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కోయి మిల్ గయా హిందీ డబ్బింగ్ సినిమాతో దక్షణాది ప్రేక్షకులకు కూడా పరిచయమున్నా.. అల్లు అర్జున్ దేశముదురుతో యాపిల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హన్సిక తొలి సినిమాతో టాలీవుడ్ కుర్రాళ్ళ మనసు గిల్లేసింది.

Hansika Motwani: యాపిల్ బ్యూటీ ప్రయోగం.. 105 నిమిషాలు.. సింగిల్ షాట్!

Hansika Motwani (1)

Hansika Motwani: అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కోయి మిల్ గయా హిందీ డబ్బింగ్ సినిమాతో దక్షణాది ప్రేక్షకులకు కూడా పరిచయమున్నా.. అల్లు అర్జున్ దేశముదురుతో యాపిల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హన్సిక తొలి సినిమాతో టాలీవుడ్ కుర్రాళ్ళ మనసు గిల్లేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్, రవితేజ లాంటి హీరోలతో నటించినా పెద్దగా కలిసిరాలేదు. బొద్దుగా ఉండే హన్సిక కాస్త సన్నబడి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అయితే, ఈసారి రొటీన్ సినిమాలతో కాకుండా కాస్త భిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటుంది. ప్రయోగాలకు కూడా సిద్ధమైంది. ప్రస్తుతం హన్సిక నటించిన ‘మహ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే హన్సిక తెలుగులో తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మై నేమ్ ఈజ్ శృతి’ షూటింగ్ ప్రారంభం కాగా మరో ప్రయోగాత్మక సినిమాకు సిద్ధమైంది. ఎలాంటి ఎడిటింగ్‌ లేకుండా 105 నిమిషాల పాటు సింగిల్‌షాట్‌లో తెరకెక్కే సినిమాలో హన్సిక సోలో పర్ఫామెన్స్ చేయబోతుంది.

ఒకే ఇంట్లో జరిగే సంఘటనలతో సాగే ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నిడివి 105 నిమిషాలు కాగా.. సింగల్ షాట్ లో ఇది తెరకెక్కించనున్నారు. ప్రయోగాత్మక చిత్రంలో నటించడం పట్ల హన్సిక ట్విట్టర్‌లో ఆనందం వ్యక్తం చేస్తూ.. రియల్‌టైమ్‌లో ఒకే షాట్‌లో తీసే ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు చక్కటి అనుభూతినందిస్తుందని.. తన కెరీర్‌లో ప్రత్యేకంగా మిగిలిపోతుందని హన్సిక పేర్కొంది. రాజా దుస్సా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.