Harish Shankar-Chiranjeevi: హరీష్-చిరు.. మరో మలయాళ రీమేక్ ప్లాన్స్?!
అదేంటో సేఫ్ గేమ్ అనుకుంటున్నారో.. లేక మన దర్శకులు, రచయితలు చెప్పే కథలు నచ్చడం లేదో కానీ మెగాస్టార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇతర బాషలలో బ్లాక్ బస్టర్ కొట్టిన కథలపై ఎక్కువగా ఆసక్తి..

Harish Shankar Chiranjeevi
Harish Shankar-Chiranjeevi: అదేంటో సేఫ్ గేమ్ అనుకుంటున్నారో.. లేక మన దర్శకులు, రచయితలు చెప్పే కథలు నచ్చడం లేదో కానీ మెగాస్టార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇతర బాషలలో బ్లాక్ బస్టర్ కొట్టిన కథలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టాడేమో అనిపిస్తుంది. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో తెరకెక్కిస్తున్న చిరు.. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వేదాళం’ను ‘భోళా శంకర్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు.
Chiranjeevi: నాన్-స్టాప్‌గా కష్టపడుతున్న మెగాస్టార్!
కాగా, ఇప్పుడు మరో మలయాళ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు సన్నాహాలు చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన ‘బ్రో డాడీ’ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించాలని చిరు భావిస్తున్నాడట. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించగా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు హీరో పృథ్వీరాజ్ దర్శకత్వం వహించడం మరో విశేషం కాగా ఈ సినిమా వచ్చినపుడే తెలుగు మేకర్స్ దృష్టి పడింది.
Chiranjeevi: మోహన్ లాల్‌పై పడ్డ చిరంజీవి.. మరోదానికి సై?
అయితే.. ఇప్పటికే చిరు రీమేక్ చర్చలు జరపగా.. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హరీష్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. కాగా.. పవన్ ఈ సినిమా పక్కనపెట్టి తమిళ సినిమా వినోదయ సిత్తం సినిమాకు ఒకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుండగా.. ఈలోగా అన్న మెగాస్టార్ బ్రో డాడీ రీమేక్ పనులు మొదలు పెట్టేలా కనిపిస్తుంది. ఒకవేళ బ్రో డే రీమేక్ నిజమే అయితే.. ఇందులో చిరంజీవి నటిస్తారా? లేక మరో హీరోకు ఛాన్స్ ఇస్తారా.. ఒకవేళ చిరు నటిస్తే మరో హీరో ఎవరు?.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.