Harish Shankar: మరోసారి ట్రెండ్ సెట్ చేస్తానంటోన్న హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతమవుతుంటే.. ఆయనకు ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందించిన దర్శకుడు హరీష్ శంకర్....

Harish Shankar: మరోసారి ట్రెండ్ సెట్ చేస్తానంటోన్న హరీష్ శంకర్

Harish Shankar Promises A Powerful Package In Bhavadeeyudu Bhagat Singh

Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతమవుతుంటే.. ఆయనకు ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందించిన దర్శకుడు హరీష్ శంకర్. ఈ సినిమాను దర్శకుడు ఔట్ అండ్ ఔట్ పవర్‌ఫుల్ కథతో తెరకెక్కించడంతో పవన్ అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక ఆ తరువాత పవన్ కెరీర్ యూ టర్న్ తీసుకుందని చెప్పాలి. అయితే ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్‌తో ఈ డైరెక్టర్ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

Bhavadeeyudu Bhagat Singh: ప్రొఫెసర్‌గా మారనున్న పవర్ స్టార్.. కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్!

‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్‌తో ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు హరీష్ చెప్పుకొచ్చాడు. కాగా.. తాజాగా నాని నటించిన అంటే సుందరానికీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ పవర్ స్టార్‌తో చేయబోయే సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. మరోసారి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడం ఆయన అభిమానిగా ఎంతో సంతోషాన్ని ఇస్తుందని.. అయితే పవర్ స్టార్ అభిమానులు తమ కాంబినేషన్ నుండి ఎలాంటి సినిమాను కోరుకుంటారో తనకు తెలుసని.. అందుకే వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, మరోసారి ట్రెండ్ సెట్టింగ్ సినిమాను చేసేందుకు తాను కూడా తీవ్రంగా ప్రయత్నిస్తానని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.

Harish Shankar: సల్మాన్ కోసం హరీష్ స్క్రిప్ట్.. త్వరలోనే ఫైనల్ చర్చలు?

ఈ క్రమంలోనే అభిమానులకు ఆయన ప్రామిస్ కూడా చేశారు. భవదీయుడు భగత్ సింగ్ సినిమా గురించి పది కాలాల పాటు మాట్లాడుకునేలా తీర్చిదిద్దుతానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక హరీష్ శంకర్ ఇలా ప్రామిస్ చేయడంతో, ఈ సినిమా ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్‌గా రాబోతుందని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.