Harish Shankar: సల్మాన్ కోసం హరీష్ స్క్రిప్ట్.. త్వరలోనే ఫైనల్ చర్చలు?

ఉత్తరాదిన ఎక్కడ చూసినా తెలుగు సినిమాల హవే. బాలీవుడ్ మేకర్స్ సైతం టాలీవుడ్ మేకర్స్ దెబ్బకి చేతులెత్తేసి హ్యాండ్సప్ చెప్పాల్సిన పరిస్థితి. నార్త్ ప్రేక్షకులు మన సినిమాలకు బ్రహ్మరధం పట్టడంతో మన మేకర్స్ కూడా బాలీవుడ్ మీద స్పెషల్ దృష్టి పెడుతున్నారు.

Harish Shankar: సల్మాన్ కోసం హరీష్ స్క్రిప్ట్.. త్వరలోనే ఫైనల్ చర్చలు?

Harish Shankar

Harish Shankar: ఉత్తరాదిన ఎక్కడ చూసినా తెలుగు సినిమాల హవే. బాలీవుడ్ మేకర్స్ సైతం టాలీవుడ్ మేకర్స్ దెబ్బకి చేతులెత్తేసి హ్యాండ్సప్ చెప్పాల్సిన పరిస్థితి. నార్త్ ప్రేక్షకులు మన సినిమాలకు బ్రహ్మరధం పట్టడంతో మన మేకర్స్ కూడా బాలీవుడ్ మీద స్పెషల్ దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే సీనియర్ దర్శకుడు వీవీ వినాయక్ తో పాటు యంగ్ దర్శకులు సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరి కూడా రీమేక్ సినిమాలతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు.

Harish Shankar: హైపర్ హరీష్.. ఫ్రస్టేషన్, హ్యాపీ.. ఏదొచ్చినా ఆగలేడు!

ఇప్పుడు మరో దర్శకుడు కూడా బాలీవుడ్ లో లక్ పరీక్షించుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్ కు రెండేళ్లగా తెలుగులో సినిమా పడలేదు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరీష్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా అవకాశం ఇచ్చాడు. అయితే.. ప్రస్తుతం పవన్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో భగత్ సింగ్ మొదలు పెట్టేందుకు సమయం పట్టేలా ఉంది. ఈలోగా హరీష్ శంకర్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.

Harish Shnkar: పవన్-త్రివిక్రమ్‌ల బంధం.. అలకబూనిన హరీష్?

హరీష్ శంకర్ బాలీవుడ్ ప్రయత్నాలు ఏదో అల్లాటప్పా హీరోలతో కాకుండా ఏకంగా బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ తో సినిమాకి ట్రై చేస్తున్నాడట. కొన్ని రోజుల క్రితం సల్మాన్ ను కలుసుకున్న హరీష్ అందుకు సంబంధించి చర్చలు కూడా జరిపాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అప్పుడే సల్మాన్ నుండి పాజిటివ్ వైబ్స్ రావడంతో హరీష్ స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టగా త్వరలోనే దానిని సల్మాన్‌కు వివరించనున్నట్లు తెలుస్తుంది. భాయ్‌కి స్క్రిప్ట్ నచ్చితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.