Railway stations Bomb threats : బాంబులతో పేల్చివేస్తామంటూ 8 రైల్వే స్టేషన్లకు బెదిరింపులు..అధికారులు అప్రమత్తం

హర్యానాలో రైల్వే స్టేషన్లను బాంబులతో పేల్చి వేస్తామని బెదిరింపులు రావటంతో అధికారులు ఉరుకులు పరుగులతో అప్రమత్తమయ్యారు.స్టేషన్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

Railway stations Bomb threats : బాంబులతో పేల్చివేస్తామంటూ 8 రైల్వే స్టేషన్లకు బెదిరింపులు..అధికారులు అప్రమత్తం

Railway Stations Bomb Threats

Haryana threat of blowing up haryanas 8 railway stations  : రైల్వే స్టేషన్లను బాంబులతో పేల్చి వేస్తామని బెదిరింపులు రావటంతో అధికారులు ఉరుకులు పరుగులతో అప్రమత్తమయ్యారు.స్టేషన్లలో తనిఖీలు మమ్మురం చేస్తున్నారు. ప్రతీ ప్రయాణీకుడిని తనిఖీలు చేస్తున్నారు.బ్యాగులు చెక్ చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానాలోని 7,8 రైల్వే స్టేషన్లకు బాంబులతో పేల్చి వేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానాలోని రేవారితో సహా సుమారు 8 రైల్వే స్టేషన్లను బాంబులతో పేల్చి వేయనున్నట్లు కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందింది. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్‌) అప్రమత్తమైంది. ఆయా రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. ప్రతీ ఒక్కరిని తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికులతో పాటు వారి లగేజీని ఆర్పీఎఫ్‌ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రేవారి రైల్వే స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు ప్రయాణికులు, వారి లగేజ్‌ తనిఖీలను ముమ్మరం చేసిన ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశామని ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ తెలిపారు. సమాచారం అందుకున్న తర్వాత RPF మరియు GRP పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని..రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. రేవారి స్టేషన్‌తో సహా అన్ని స్టేషన్లలో ప్రయాణీకులను వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు. అన్ని స్టేషన్లలో పూర్తి నిఘా ఉంచామని ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. కుట్రదారుల పథకాలు ఫలించవని అన్నారు.

కాగా..హర్యానాలోని పలు రైల్వే స్టేషన్లతో పాటు ఆరు రాష్ట్రాల్లో స్టేషన్లు, దేవాలయాలను పేల్చివేస్తామని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హెచ్చరించింది. దసరా సందర్భంగా ఆరు రాష్ట్రాల్లో కనీసం 11 రైల్వే స్టేషన్లు, 6 దేవాలయాలను పేల్చివేస్తామని బెదిరిస్తూ జైష్ నుండి భద్రతా దళాలకు బెదిరింపు లేఖ వచ్చింది.

అక్టోబర్‌లో జైష్-ఎ-మహ్మద్ హిట్ లిస్ట్‌లో పేరున్న రైల్వే స్టేషన్‌లలో రెవారీతో పాటు రోహ్‌తక్, హిసార్, కురుక్షేత్ర, ముంబై సిటీ, బెంగళూరు, చెన్నై, జైపూర్, భోపాల్, కోటా మరియు ఇటార్సీ ఉన్నాయి. మరోవైపు ఆలయాల విషయానికి వస్తే.. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని పలు ఆలయాలను పేల్చివేస్తామని లేఖలో బెదిరించారు. దీంతో అధికారులు అప్రమత్తమై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.