Goat Milk : మేకపాలతో ఆరోగ్యం…రోజుకొక గ్లాసు చాలంటున్న నిపుణులు

ఆవుపాలు, గేదెపాలకంటే మేకపాలల్లో కాల్షియం, మాంసకృత్తులు, కార్భోహైడ్రేట్లు, అధికంగా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది.

Goat Milk : మేకపాలతో ఆరోగ్యం…రోజుకొక గ్లాసు చాలంటున్న నిపుణులు

Goat Milk

Goat Milk : ప్రస్తుత పరిస్ధితుల్లో మనిషికి పూర్తిస్ధాయిలో పోషకాలు అందాలంటే పాలు తప్ప మరో మార్గంలేదు. పాలు అనగానే అందరికి గుర్తుకు వచ్చే ఆవుపాలు, గేదెపాలు. అయితే ఈ రెండింటికన్నా ఏక్కువ పోషకాలు కలిగిన పాలు మేకపాలు. గేదె, ఆవు పాల కంటే మేక పాలు చాలా శ్రేష్టమైనవని ఆరోగ్యనిపుణులు ఇప్పటికే అనేమార్లు స్పష్టం చేశారు.

ఆవుపాలు, గేదెపాలకంటే మేకపాలల్లో కాల్షియం, మాంసకృత్తులు, కార్భోహైడ్రేట్లు, అధికంగా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. మేకపాలల్లో ఎముకల పటుత్వాన్ని పెంచే విటమిన్ డి, కాల్షియం సమృద్ధిగా దొరుకుతాయి. కీళ్ళ నొప్పులు, అర్ధరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు మేకపాలు తాగితే వాటి నుండి కొంత మేర ఉపశాంతి లభిస్తుంది. మేకపాలలో ఉండే ఫ్యాట్ తేలికగా జీర్ణమయ్యేలా చేస్తాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మేకపాలు తీసుకోవటం ఉత్తమం.

చర్మ సంబంధిత సమస్యలు తొలగించి కొత్తకణాలు ఏర్పడేలా చేసేందుకు మేకపాలల్లోని విటమిన్ ఎ, ఇ లు తోడ్పడతాయి. ఎర్ర రక్తకణాల అభివృద్ధి వేగంగా ఉంటుంది. క్యాన్సర్ కారకాలను కూడా ఈ మేకపాలు నిర్మూలిస్తాయని నిపుణులు అంటున్నారు. మేకపాలల్లో లాక్టోజ్ చాలా తక్కువగా ఉంటుంది. గేదె, ఆవు పాలల్లో ఉండే ఎ1 కేసిన్ ఉంటుంది. దీని వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి. మేకపాలల్లో ఎ2 కేసిన్ ఎక్కవగా ఉండటం వల్ల జీర్ణసమస్యలు దరిచేరవు.

శరీరంలోని హెడిఎల్ స్ధాయిని మేకపాలు పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచే సెలినియం అనే ఖనిజం ఎక్కుగా ఉంటుంది. థైరాయిడ్ వంటి వ్యాధులకు ఈ సెలేనియం ఎంతో మేలు చేస్తుంది. జాతిపిత మహాత్మాగాంధీ సైతం తన ఆరోగ్యం కుదుటపడేందుకు వైద్యుల సలహామేరకు మేకపాలు తాగినట్లు చరిత్ర చెబుతుంది. అందుకే రోగాలు మీదరికి చేరకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకొక గ్లాసు మేకపాలు తాగటం మంచిది.