Corn Husks : గుండెకు మేలు చేసే మొక్క జొన్న పొత్తులు

గర్భవతులు డైట్ లో మొక్కజొన్న కండెలను తీసుకోవటం వల్ల మంచి పోషకాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు. గర్భవతులకు తగిన ఫోలిక్ ఆసిడ్ అందించటంలో మొక్కజొన్న బాగా ఉపయోగపడుతుంది.

Corn Husks : గుండెకు మేలు చేసే మొక్క జొన్న పొత్తులు

Corn Husks

Corn Husks : మొక్క జొన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొక్కజొన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కకువగా ఉండే మొక్కజొన్న జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఒంట్లోపేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణం వీటికి ఉంది. ఇందులో ఉండే విటమిన్ బి12, ఫోలిక్ ఆసిడ్, ఐరన్ రక్తకణాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. రక్తహీనతల లేకుండా చేస్తుంది. వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ ఫెక్షన్లను తట్టుకునే శక్తిని శరీరానికి అందిస్తాయి. మొక్కజొన్నలో పీచు పుష్కలంగా వుంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. పీచు మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

మొక్కజొన్నలో ఉండే విటమిన్‌ సి, కేరోటియాయిడ్లు, బయో ప్లేవినాయిడ్లు మీ గుండెను చెడు కొలెస్టరాల్‌ నుంచి కాపాడుతాయి. శరీరంలో రక్తప్రసరణ అధికం చేస్తాయి. మొక్కజొన్నలో ఉండే కార్బోహూడ్రేట్స్ శరీరానికి కావాల్సినంత బలాన్ని ఇస్తాయి. అదే క్రమంలో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు మొక్కజొన్న ద్వారా లభిస్తాయి. ఇందులో ఉండే కాపర్, మాంగనీస్, రక్తంలో చక్కర నిల్వలను క్రమబద్దీకరిస్తాయి. ఎములను బలంగా మారుస్తాయి. గర్భవతులు డైట్ లో మొక్కజొన్న కండెలను తీసుకోవటం వల్ల మంచి పోషకాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు. గర్భవతులకు తగిన ఫోలిక్ ఆసిడ్ అందించటంలో మొక్కజొన్న బాగా ఉపయోగపడుతుంది.