Breast Feeding : తల్లిపాలను పెంచే సహజమార్గాలు ఇవే…

బిడ్డ పుట్టిన తర్వాత నెల రోజుల పాటు.. కేవలం తల్లి పాలు మాత్రమే తాగించడం చాలా శ్రేయస్కరం. ఇలా చేయటం వల్ల చిన్నారుల్లో అకస్మిక మరణాలను తగ్గించవచ్చు.

Breast Feeding : తల్లిపాలను పెంచే సహజమార్గాలు ఇవే…

Breast Milk

Breast Feeding : తల్లిపాలు పుట్టిన పిల్లలకు అమృతం లాంటివి. బిడ్డకు రోగనిరోధక వ్యవస్ధను పెంపొందించే ఎన్నో పోషకాలు తల్లిపాలల్లో లభిస్తాయి. ఎక్కవ ప్రొటీన్లు, తక్కువ చక్కెరలు పాలద్వారా బిడ్డకు అందుతాయి. ఇవి త్వరగా అరిగేందుకు దోహదపడతాయి. ప్రాణాంతకమైన ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి వారిని కాపాడుతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం పోత పాలకు బదులు కేవలం తల్లి పాలు మాత్రమే తాగిన పిల్లలకు టైప్ 1 డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, చెవి ఇన్ఫెక్షన్లు, జలుబు, జ్వరాలు వంటివన్నీ దూరంగా ఉంటాయని సమాచారం.

బిడ్డ పుట్టిన తర్వాత నెల రోజుల పాటు.. కేవలం తల్లి పాలు మాత్రమే తాగించడం చాలా శ్రేయస్కరం. ఇలా చేయటం వల్ల చిన్నారుల్లో అకస్మిక మరణాలను తగ్గించవచ్చు. తల్లిపాలు పట్టడం వల్ల బిడ్డ తెలివితేటలు బాగా పెరుగుతాయి. చురుకు దనంగా ఉంటారు. తల్లి పాలు ఇవ్వడం వల్ల గర్భం ధరించిన తర్వాత పెరిగిన బరువు తిరిగి తగ్గే వీలుంటుంది. పాలు పట్టిన తల్లుల్లో రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్లు వచ్చే ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. పాలు పట్టేటప్పుడు విడుదలయ్యే ఫీల్ గుడ్ హార్మోన్ల కారణంగా తల్లుల్లో వచ్చే మానసికమైన వత్తిడులను పోగొట్టవచ్చు.

ఇదిలా వుంటే చాలా మంది తల్లుల్లో బిడ్డకు సరిపడా పాలు పడకపోవచ్చు. అలాంటప్పుడు తల్లికి ఉన్న ఏకైక మార్గం బిడ్డకు పాలు పట్టేందుకు ప్రయత్నించడమే. బిడ్డ పాలు చీకుతూ ఉంటే.. మరింత ఎక్కువగా పాలు వస్తూ ఉంటాయి. దీనికితోపడు పాలు పడే ఆహారాలను తల్లి తీసుకోవాలి. ఓట్ మీల్ , వెల్లుల్లి, పచ్చి బొప్పాయి, కూరగాయలు, ఆకుకూరలు, అరటి, మామిడి, తర్బూజా లాంటి పండ్లు, మెంతులు,గింజలు, డ్రైఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవటం వల్ల పాలు పెరిగే అవకాశం ఉంటుంది.