Sumanth : విలన్ క్యారెక్టర్స్ చేయడానికి నేను రెడీ.. ఓటీటీలకు కూడా సిద్ధం..

వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మించిన సీతారామం సినిమా ఆగస్టు 5న రిలీజ్‌ కాబోతుంది. ఈ సినిమాలో సుమంత్‌ బ్రిగేడియర్‌ విష్ణుశర్మ అనే పాత్ర...........

Sumanth : విలన్ క్యారెక్టర్స్ చేయడానికి నేను రెడీ.. ఓటీటీలకు కూడా సిద్ధం..

Sumanth

Sumanth :  అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుమంత్. మంచి మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించారు. గత కొన్ని రోజులుగా సరైన విజయం కోసం చూస్తున్నారు. తాజాగా దుల్కర్‌ సల్మాన్, మృణాళినీ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా కీలక పాత్రలో నటించిన ‘సీతారామం’ సినిమాలో సుమంత్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు.

వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మించిన సీతారామం సినిమా ఆగస్టు 5న రిలీజ్‌ కాబోతుంది. ఈ సినిమాలో సుమంత్‌ బ్రిగేడియర్‌ విష్ణుశర్మ అనే పాత్ర చేశారు. తాజాగా ఈ పాత్రని పరిచయం చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ‘కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు. దిస్ ఈజ్ బ్రిగేడియర్‌ విష్ణు శర్మ… మద్రాస్‌ రెజిమెంట్‌’’ అనే డైలాగ్‌ తో సుమంత్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో సుమంత్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

Manchu Vishnu: ప్రీలుక్‌తోనే క్యూరియాసిటీ పెంచేసిన జిన్నా..!

ఈ పాత్ర ప్రకటించిన సందర్భంగా సుమంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ”పదహారేళ్ల క్రితం ‘గోదావరి’ సినిమాలో సీతరాముల కథను చెప్పాం. ఇప్పుడు ఈ ‘సీతారామం’ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో బ్రిగేడియర్‌ విష్ణుశర్మ పాత్రలో నన్ను నటించమని అడిగినప్పుడు స్క్రిప్ట్‌ మొత్తం ఇవ్వమని డైరెక్టర్ హను రాఘవపూడిగారిని అడిగాను. ఆయన ఇచ్చిన 150 పేజీల స్క్రిప్ట్‌ను చదివి ఆ తర్వాత విష్ణు శర్మ పాత్రకు ఓకే చెప్పాను.

సీతారామం సినిమాలో నా పాత్ర కీలకమైనది. నెగటివ్‌ రోల్‌ కాకపోయినా ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. ఈ సినిమాతో దుల్కర్‌ సల్మాన్‌ ఓ మంచి కో స్టార్‌గా మారాడు. నేను సెట్స్‌లో ఉన్నప్పుడు నేను యాక్ట్ చేసింది మానిటర్‌ లో చూడను. డైరెక్టర్‌ ఓకే అంటే నాకు కూడా ఓకేనే. ఈ సినిమా రషెస్‌ చూసి అశ్వనీదత్‌ గారు నన్ను అభినందించారు. ఈ సినిమాతో పాటు హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాను. పెద్ద హీరోలు కూడా ఓటీటీలో యాక్ట్ చేస్తున్నారు. నాకు కూడా ఆఫర్స్‌ వస్తున్నాయి. కథ నచ్చితే కచ్చితంగా ఓటీటీలో చేస్తాను. విలన్ క్యారెక్టర్ కూడా చేయడానికి రెడీనే. కానీ ఇంకా విలన్ గా ఎవరూ అడగట్లేదు” అని తెలిపారు.